Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

గుండ్రేవులపై ఇంత నిర్లక్ష్యమా?

. ఏళ్లు గడుస్తున్నా ముందుకు కదలని పనులు
. ప్రాజెక్టు పూర్తయితే కేసీ కెనాల్‌ ఆయకట్టు పూర్తిగా స్థిరీకరణ
. పాలకుల తీరుపై సీమ రైతుల ఆగ్రహం

విశాలాంధ్రబ్యూరో – కర్నూలు :
కర్నూలు, కడప జిల్లాల రైతుల జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్టు. అది పూర్తయితే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత బీడు భూములు సస్యశ్యామలమవుతాయి. కర్నూలు-కడప కాలువ కింద ఉన్న ఆయకట్టుకు సరిపడా నీరు ఇవ్వొచ్చు. తాగునీటి ఇబ్బందుల నుండి కర్నూలు నగర ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు గూడూరు, సి.బెళగల్‌, కోడుమూరు, కర్నూలు మండలాల్లో బీడు భూములు పంటలకు అనువుగా మారతాయి. రెండు జిల్లాలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు ఆరంభంలోనే ఆగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా నిధులు ఇవ్వక ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. పాలకులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడం లేదు. ఎప్పుడు పనులు మొదలు పెడతారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిన గుండ్రేవుల ప్రాజెక్టుపై విశాలాంధ్ర ప్రత్యేక కథనం…
కర్నూలు, కడప తీవ్ర వర్షభావం గల జిల్లాలు. వర్షం వస్తే తప్ప పంటలు పండే పరిస్థితి లేదు. ఈ రెండు జిల్లాల రైతులకు సాగు, తాగునీరు అందించే కేసీ కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. ఈ కాలువకు నీరు అందించే సుంకేసుల డ్యామ్‌ నీటి సామర్థ్యం కేవలం1.2 టీఎంసీలు మాత్రమే. ఈ కాలువ కింద కర్నూలు, కడప జిల్లాల్లో ఉన్న 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించలేని పరిస్థితి ఉంది. కేసీ కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరు అందించాలన్నా, కర్నూలు జిల్లాలో కరువు కాటకాలతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించాలన్నా…తుంగభద్ర నదిపై గుండ్రేవుల వద్ద ఆనకట్ట నిర్మించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని సాగునీటి నిపుణులు సూచించారు.
డీపీఆర్‌కు 2013లోనే నిధుల కేటాయింపు
సీ.బెలగల్‌ మండలంలో గుండ్రేవుల దగ్గర 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం డీపీఆర్‌ తయారీకి రూ.54.95 లక్షలకు పరిపాలన ఆమోదం ఇచ్చింది. 2013 నవంబర్‌ ఒకటిన టెండర్లు ఆహ్వానించి…హైదరాబాద్‌కు చెందిన ఏఆర్వీఈఈ అసోసియేట్స్‌కు కాంట్రాక్టు అప్పగించింది. ఈ సంస్థ సర్వే, విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో ముడిపడి ఉంది. రెండు రాష్ట్రాల సమన్వయంతోనే ఈ ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీలో కర్నూలు జిల్లాలోని సంగాల, కొత్త సంగాల, తిమ్మన దొడ్డి, పలుకుదొడ్డి చింతమనపల్లి, రాయచోటి, గురుజాల, నాగలదిన్నేలో 10 గ్రామాలు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెద్ద దన్వాడ, వేణి, సోమాపురం, కేశవరం 5 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని నివేదిక తెలిపింది. కర్నూలు జిల్లాలో చెరువుపల్లి, చామల గూడూరు, పెద్ద కొట్టాల, జోహరాపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కటుకునురు, కిసాన్‌నగర్‌ గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయని వెల్లడిరచింది. 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి 2015 అక్టోబర్‌ 13న డీపీఆర్‌ను సంబంధిత అధికారులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కేఆర్‌ఎంబీ ద్వారా రూ.2,890 (సవరించిన అంచనాల ప్రకారం రూ.5,400 కోట్లకు చేరింది) కోట్లకు ఈ ప్రాజెక్టు అనుమతి పొందింది. సుంకేసుల బ్యారేజ్‌కి తుంగభద్ర నదిపై అదనపు రిజర్వాయర్‌ కోసం ప్రభుత్వం సూత్రప్రాయంగా పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ 2019 ఫిబ్రవరి 21న జీవో జారీ చేసింది. అంతేకాక అప్పటి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కోడుమూరు సమీపంలో శిలాఫలకం వేశారు. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో ఈ ప్రాజెక్టును చేర్చారు. కేంద్రం 2020 అక్టోబర్‌ 6న నీటి సమస్యలపై అపెక్స్‌ సమావేశం ఏర్పాటు చేసింది. కానీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై చర్చను కూడా తీసుకురాలేదు.
ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని పనులు
ప్రాజెక్టు డీపీఆర్‌ను 2015లో ఆమోదించినా…2019 ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చినా…ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని పరిస్థితి. రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ మధ్య సత్సంబంధాలు ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, శరవేగంగా పనులు పూర్తి చేస్తారని రైతన్నలు భావించారు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పట్లో పనులు మొదలయ్యేలా కనిపించడం లేదు. దీంతో కర్నూలు, కడప జిల్లాల అన్నదాతల ఆశలు అడియాసలవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతులు, కేసీ కెనాల్‌ కింద ఉన్న ఆయకట్టు రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి భూములకు నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీపీఐ, ఏపీ రైతుసంఘం నాయకులు పదేపదే ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడమే కాకుండా పెండిరగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పాజెక్టులు సందర్శించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img