Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కొల్లేరును కొల్లగొడుతున్నారు!

ఆక్రమణదారుల చెరలో తాగునీటి సరస్సు

. బడాబాబులకు అధికారుల దాసోహం
. నోట్ల కట్టలతో నోరుమూస్తున్న కబ్జాదారులు
. అమలుకాని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు
. సహజత్వాన్ని కోల్పోతున్న అభయారణ్యం
. వేసవిలో ఎడారిని తలపిస్తోన్న వైనం
. వలస పక్షులకు ముప్పు… చలించిపోతున్న పర్యాటకులు
. ఘనమైన చరిత్ర పుస్తకాలకే పరిమితం

దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరు భవితవ్యం నేడు కలవరపెడుతోంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సరస్సు స్వార్థపూరిత రాజకీయాల వలలో చిక్కి శల్యమవుతోంది. సుమారు లక్ష ఎకరాల్లో విస్తరించిన సరస్సు 60 శాతం పైగా అక్రమార్కుల కబందహస్తాల్లో బందీ అయి సహజత్వాన్ని కోల్పోతోంది. కొల్లేరును పరిరక్షించాలని కలలుగన్న చంద్రబాబు తీసుకొచ్చిన జీవో 12ను వైఎస్‌ అమలు పరిచినా నేడు వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణల పర్వానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. 2009లో కేంద్రం చిత్తడి నేలల పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నా, 2012లో ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా ప్రకటించినా ఐదో కాంటూరు నానాటికీ కుచించుకుపోతూ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించింది. సహజసిద్ధంగా ఏర్పడి ఆసియా ఖండంలోనే ఘనతకెక్కిన కొల్లేరు నేడు గడ్డు కాలం ఎదుర్కొంటోంది. రానురాను కర్పూర హారతిలా కరిగిపోతోంది.

విశాలాంధ్ర – డిజిటల్‌ : ఆంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన తాగునీటి సరస్సు కొల్లేరు. సుమారు లక్ష ఎకరాలకు విస్తరించి ఉన్న సరస్సు 88 రకాల చేపల వృద్ధికి ప్రసిద్ధి. పచ్చటి ప్రకృతి అందాలతో, ఆస్ట్రేలియా, సైబీరియా, దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా, అలస్కా నుంచి వచ్చే 183 రకాల వలస పక్షులు నివాసం ఏర్పరచుకుని కిలకిలరావాలతో చేసే అల్లరితో కొల్లేరు అలరారుతూ ఉంటుంది. కృష్ణా, గోదావరి నదుల డెల్టా ప్రాంతంలో ప్రకృతి ప్రసాదించిన లోతట్టు సరస్సులో బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరుల ద్వారా నీరు వచ్చి చేరుతుంది. కొల్లేరు సుమారు 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇదంతా గతం. అయితే, స్వార్థపూరిత రాజకీయాల వల్ల నేడు అది బక్కచిక్కిపోతోంది. బడాబాబులు కొల్లేటివాసులను ఏమర్చి సొసైటీల మాటున వేలాది ఎకరాల్లో వెయ్యికి పైగా అక్రమంగా చేపల చెరువులు తవ్వడంతో 42 శాతం మేర సహజత్వాన్ని కోల్పోయింది. ఉన్న నీటిని కాస్తా మోటార్లతో తోడేయడంతో వేసవిలో ఎడారిని తలపిస్తోంది. ఎనిమిది శాతం పైగా భూమిలో వ్యవసాయం చేయడంతో ఘనమైన గత చరిత్రను పుస్తకాల్లో చదివి సరస్సు చూడడానికి వెళ్లిన యాత్రికులకు నేడు కనిపించేది చిన్న తరహా చెరువు. కబ్జాదారుల కోరల్లో చిక్కిశల్యమైన కొల్లేరును చూసి ప్రకృతి ప్రేమికులు చలించిపోతున్నారు. దురాశ, దుర్నీతి, దురాక్రమణ చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా పేరొంది నేడు కాలుష్య కోరల్లో చిక్కి గరళంగా మారడం యాత్రికులకు మింగుడు పడడం లేదు.
కొల్లేరు సమాంతర కొలతలు తీసి కాంటూర్లుగా నిర్ధారిస్తారు. కానీ ఏ కాంటూరు చూసినా ఆక్రమణలపర్వం రాజ్యమేలుతోంది. ముఖ్యంగా ఐదో కాంటూరు నిత్యం వివాదాలమయమే. ఆర్థిక, అంగ, అధికార బలం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు భూముల్లో అడ్డూఅదుపూ లేని ఆక్రమణలను అడ్డుకునేవారే కరవయ్యారు. బడాబాబులు వందలాది ఎకరాల పైబడి రాజకీయ అండతో చేపల చెరువుగా మార్చేసినా అడిగే నాథులే లేరు. పర్యావరణానికి తూట్లు పొడిచి ఆక్వా సాగు చేస్తూ తలాపాపం తిలాపిడికెడు అన్నట్టు నోట్ల కట్టలను ప్రజాప్రతినిధులు, అధికారుల నోట్లో కుక్కి నోరు మూయించడం బహిరంగ రహస్యమే.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు చంద్రబాబు సీఎంగా ఉండగా, దృఢనిశ్చయంతో కొల్లేరును కాపాడే ప్రయత్నం చేశారు. 1999లో చంద్రబాబు ప్రభుత్వం జీవో 12 విడుదల చేసి ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. 2006లో వైఎస్‌ ఆ జీవోను అమలు చేశారు. ‘ఆపరేషన్‌ కొల్లేరు’ను పకడ్బందీగా అమలుపరిచి ఆక్రమణలు తొలగించారు. చేపల సాగు చేస్తున్న చెరువులన్నింటినీ ధ్వంసం చేయించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టడి జరిగినా ఆ ఘనత అంతా వైఎస్‌కే దక్కింది.
నేడు వైసీపీ హయాంలో కబ్జాదారులు తమ కార్యకలాపాలు దర్జాగా సాగిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా ఓ ప్రజాప్రతినిధి తన చేపల చెరువుల వద్దకు వెళ్లేందుకు నేరుగా రహదారినే నిర్మించారని కొల్లేరు వాసులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. పాలకులు, అధికారులకు ఈ విషయం తెలియనిది ఏమీ కాదు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరైనా నిలదీస్తే దళితులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. ఆక్రమణలు తొలగించాలని, చెరువులను ధ్వంసం చేయాలని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టు, హైకోర్టు తీర్పు అమలు చేయాలని గగ్గోలు పెట్టినా అధికారులు బుట్టదాఖలు చేశారని మండిపడుతున్నారు. దశాబ్దాల క్రితం కొల్లేరు వాసులు సరస్సులో స్వేచ్ఛగా చేపలు పట్టుకుని జీవనోపాధి సాగించేవారు. కానీ నేడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకోవడంతో వారి వద్దే కొల్లేటి ప్రజలు కూలీలుగా మారారు. ఆత్మాభిమానం చంపుకోలేని మరికొందరు ఉపాధి కోసం వలసబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడిరది. చేపల చెరువుల నుంచి విడుదలైన కలుషిత నీరు మంచినీటిని గరళంగా మార్చడంతో ఆ నీరు తాగి పక్షులు సైతం మృత్యువాత పడుతున్నాయి. పశువులకు సైతం అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని పశుపోషకులు లబోదిబోమంటున్నారు. కొల్లేటి వాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు. వలస పక్షులను, ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన అధికారులు బడాబాబులకు దాసోహమై అందినకాడికి దోచుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిట్టచివరి ప్రయత్నంగా కాంటూరు ఐదు పరిధిని కాంటూరు మూడుకు కుదిస్తే సుమారు 40 వేల ఎకరాల వరకు భూమి సాగులోకి వస్తుందని, స్థానికులకు ఉపాధి లభిస్తుందని, వలసలు నివారించవచ్చన్న ప్రజాభిప్రాయం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా హామీ ఇచ్చారు. కానీ హామీలు స్వార్థపూరిత రాజకీయాల వల్ల నీటి మూటలుగా మారాయి. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమలుకు ప్రభుత్వ యంత్రాంగం ఆసక్తి చూపకపోవడం, రాజకీయ నాయకులు, అధికారులు, ఆక్రమణదారులు తమతమ పాత్రను గణనీయంగా పోషించడంతో కొల్లేరులో కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది.
ఓట్ల రాజకీయాన్ని పక్కనబెట్టి అభయారణ్య చట్టాన్ని (1972) అమలు చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, కొల్లేరు సరస్సుకు పూర్వ వైభవం తీసుకురావాలని, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, అక్రమ చేపల సాగును అరికట్టాలని, కొల్లేరు భూములను రక్షించి, కొల్లేటి ప్రజల వలసబాటను నివారించాలని ప్రజలు, ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img