Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : సరిగ్గా ఏడాది క్రితం ఇంటి పెద్దను ఆ కుటుంబం కోల్పోయింది… అయినా మనోధైర్యంతో ముందుకు సాగింది… చిన్న వయస్సులో ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది… ప్రజా అశీర్వాదంతో గెలిచింది… ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు ప్రమాదాల రూపంలో వెంటాడుతూనే ఉంది. గడిచిన 60 రోజుల్లో అమె మూడు ప్రమాదాలకు గురి కావడమే అందుకు నిదర్శనం. రెండు ప్రమాదాలను తప్పించుకున్న అమె మూడో ప్రమాదంలో మృత్యువును తప్పించుకోలేకపోయింది.
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత(36) శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నగరంలోని పటాన్‌ చెరువు ఓఆర్‌ఆర్‌పై శుక్రవారం ఉదయం అమె ప్రమాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న రెయిలింగ్‌ను డీకొట్టింది. ఈ ప్రమాదంలో అమె అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న పీఏ అకాశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక సీటులో కూర్చున్న ఎమ్మెల్యే సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో భారీ కుదుపులకు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే అప్పటికే మృతి చెందగా ఆమె పీఏకు చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందగా సంవత్సరం తిరిగేలోపే లాస్య మృతి కుటుంబంతో పాటు నియోజకవర్గ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది.
ప్రమాదానికి ముందు ఏం జరిగింది…
ఎమ్మెల్యే లాస్య అసలు ఉదయమే ఎక్కడికి వెళ్లిందనే అనుమానాలు పలువురిని రేకెత్తించాయి. గురువారం ఆమె సదాశివపేట వెళ్లారని ఒకరు, బాసర నుంచి తిరుగొస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు ఇలా రకరకాలుగా వ్యాఖ్యానించారు. చివరకు ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందిత సదాశివపేట దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్లినట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్‌ నుంచి కోనాపూర్‌ వెళ్లే మార్గంలో ఉన్న మీస్కిన్‌ బాబా దర్గాకు ఆమె వెళ్లినట్లు తెలిసింది. ఈ దర్గాకు ఎమ్మెల్యే అర్ధరాత్రి సుమారు 12.30 గంటలకు వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం ఉదయం మూడు, నాలుగు గంటల మధ్య దర్గా నుంచి వెళ్లిపోయిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img