Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇండియాను చీల్చడానికే…

ఈడీ పదవీకాలం పొడిగింపుపై విపక్షాల మండిపాటు

న్యూదిల్లీ : ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలం పొడిగింపుపై రాజకీయ దుమారం చెలరేగింది. సెప్టెంబరు 15వ తేదీ వరకు సంజయ్‌కుమార్‌ మిశ్రా పదవీకాలం పొడిగించిన కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మిశ్రా పదవీకాలాన్ని మోదీ సర్కారు పొడిగించిందని మండిపడ్డాయి. విపక్ష కూటమి ‘ఇండియా’ను బలహీనపర్చడానికిగాను తప్పుడు కేసులతో విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికే మోదీ సర్కారు ఈ బరితెగింపు నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి. ఈడీ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు అత్యవసరమని, ఆయన నాయకత్వంలో కొనసాగుతున్న కేసులు అనేకం ఇంకా పెండిరగ్‌ల ఉన్నాయని మోదీ సర్కార్‌ తెలపడంతో ఆయన పదవీకాలాన్ని సెప్టెంబరు 15వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇచ్చిన విషయం విదితమే. అదేసమయంలో ఈడీ డైరెక్టర్‌గా నియమించడానికి మిశ్రా కన్నా సమర్ధులు ఇంకెవరూ లేరా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. ఈడీ పదవీకాలం పొడిగింపుపై విపక్ష నేతలు పార్లమెంటు బయట సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ రaా మాట్లాడుతూ అక్రమం, చట్టవిరుద్ధమైనప్పటికీ మిశ్రా పదవీకాలాన్ని కేంద్రం పొడిగించిందని విమర్శించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ దురుద్దేశమేనని స్పష్టంచేశారు. అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా విపక్ష కూటమి ‘ఇండియా’ను చీల్చడానికి బీజేపీ విశ్వప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయం తమకు తెలుసునని, ప్రభుత్వానికి తాము అదేస్థాయిలో గుణపాఠం చెబుతామని మనోజ్‌ రaా చెప్పారు. ఎస్‌పీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఈడీ అధిపతిగా మిశ్రా తప్ప ఇంకెవరూ సమర్ధులు లేరా అని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిందని, దీనికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదని చెప్పారు. తప్పుడు కేసులతో విపక్ష నేతలను వలలో వేసుకోవడం కోసమే మిశ్రాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉపనాయకుడు ప్రమోద్‌ తివారీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నెలన్నర కాలం మాత్రమే మిశ్రా పదవీకాలం ఎందుకు పొడిగించారని, ఈ కొద్ది సమయంలో ఏమి చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. బీహార్‌, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ ఏమైనా చేస్తుందని, అయితే, రాజకీయంగా విఫలం కావడం తప్పదని స్పష్టంచేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్దారు. ఇండియా ఆవిర్భావంతో బీజేపీకి భయం పట్టుకుందని తివారీ వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌ మాట్లాడుతూ బీజేపీకి ఆయుధంగా ఈడీ పనిచేస్తోందని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని బీహార్‌, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌ ప్రభుత్వాలను బీజేపీ లక్ష్యంగా చేసుకుందన్నారు. ఈ ప్రభుత్వాలను అస్థిరపరచడం ద్వారా ఇండియా కూటమిని బలహీనపర్చడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img