Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గళం విప్పే నేతలను గెలిపించండి

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

విశాలాంధ్ర`మల్కాపురం (విశాఖ) : కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకుంటోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. బుధవారం సాయంత్రం నగరంలోని పారిశ్రామిక ప్రాంతం సింధియా జంక్షన్‌ నుంచి శ్రీహరిపురం వరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ‘ఇండియా’ కూటమి సీపీఐ అభ్యర్థి అత్తిలి విమలను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతపురం శ్రీహరిపురం గొల్లలపాలెం మైదానంలో నిర్వహించిన సభలో నారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాకుంటే ఎన్‌డీఏ కూటమి దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌లకు కట్టబెట్టడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో మోదీకి ప్రజలంతా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేల గెలుపు చాలా ముఖ్యమన్నారు. అధికారంలోకి వచ్చే ముందు నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తామని, ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన నరేంద్ర మోదీ పదేళ్లలో పైసా నల్లధనం తీసుకురాకపోగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని, ప్రజలంతా గమనించి ఈ పన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. లాభాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను, గంగవరం పోర్టును అదానీతో పాటు ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా అందించాలని మోదీ ప్రభుత్వం చూస్తోందన్నారు. మరోపక్క నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజల గొంతును పార్లమెంట్‌లో వినిపించే ‘ఇండియా’ కూటమి అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, సీపీఐ నేతలు ఏజే స్టాలిన్‌, సీహెచ్‌ రాఘవేంద్రరావు, ఎం.పైడిరాజు, డి.ఆదినారాయణ, జి.ఎస్‌.అచ్యుతరావు, కె.సత్యాంజనేయ, గుడాల రాంబాబు, కసిరెడ్డి సత్యనారాయణతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img