London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

జల వివాదాలపై అఖిలపక్షం

కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌ను సరిదిద్దాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌

అమరావతి : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సంయుక్త సమావేశాలపై జరుగుతున్న పరిణామాలు మరింత వివాదాస్పదంగా మారుతున్నందున తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం డిమాండు చేసింది. తప్పులతడకగా ఉన్న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌పై పూర్తిస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ను సరిదిద్దేలా ఒత్తిడితీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జలవివాదాలు, కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు వెల్లడిరచాలని, అన్ని పార్టీలు ఏకతాటిపై ఉండటానికి అఖిలపక్ష సమావేశం దోహదపడుతుందని సీపీఐ సలహా ఇచ్చింది. స్థానిక దాసరి భవన్‌లో శనివారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేవీవీ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ జాతీయ రాజకీయ పరిణామాలను, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను, భవిష్యత్‌ కర్తవ్యాలను వివరించారు. అనంతరం వివిధ అంశాలపై కార్యవర్గం చర్చించి కొన్ని తీర్మానాలను ఆమోదించింది. జల వివాదాలపై తీర్మానం కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల కాలాన్ని వృథాచేసి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాల పరిష్కారం కోసం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఏర్పాటునకు జులై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలులేని, తెలంగాణాకు సంబంధంలేని ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం, సీలేరు ఇత్యాది ప్రాజెక్టులను చేర్చడం సరైంది కాదు. దీన్ని వెంటనే సరిదిద్దాలి. విభజన చట్టంలో ఆమోదించిన వెలుగొండను అనుమతి పొందిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలి. తెలుగుగంగ, గాలేరునగరి (గండికోట), హంద్రీ`నీవా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను ఆ జాబితాలో చేర్చాలి. యాజమాన్య బోర్డులో సమాన నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండాలి. హెచ్‌ఎల్‌సీ,

ఎల్‌ఎల్‌సీ కాలువలను తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డు పరిధిలోనే ఉంచాలి. 2014 విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా, గోదావరి నదుల నీటిని, పరిధులను నిర్థిష్టంగా పొందుపర్చాలి. వాటి సక్రమ అమలుకు నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా కృష్ణానదీ జలాలను పంపిణీ చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఏ ప్రాజెక్టులకు ఎంత అవసరమో ఆ మేరకు వినియోగించుకునే స్వేచ్ఛ రాష్ట్రానికి ఉండాలి. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం కొనసాగించాలి. గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు ఉపయోగిస్తున్నందున ఆ మేరకు ఆదా అయ్యే కృష్ణానీటిని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మళ్లించేలా జీవో విడుదల చేయాలి. లేదా యాజమాన్య బోర్డులో చేర్చాలి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఒప్పించాలని డిమాండ్‌ చేస్తూ కార్యవర్గం తీర్మానించింది.
సీపీఎస్‌ను రద్దు చేయాలని మరో తీర్మానం
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కార్యవర్గం మరో తీర్మానం చేసింది. 2004 జనవరి నుండి ప్రభుత్వ ఉద్యోగాలలో చేరేవారికి నూతన పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) వర్తింపు చేస్తూ కేంద్రం పార్లమెంటులో చట్టం చేసింది. దీనికి అనుగుణంగా 2004 సెప్టెంబరు ఒకటి నుండి మన రాష్ట్రంలో చేరే ఉద్యోగులకు వర్తింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత పెన్షన్‌ స్థానంలో సీపీఎస్‌ను అమలు చేయడం వలన, పెన్షన్‌ భద్రత లేనందున రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు జగన్‌మోహనరెడ్డి పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామన్నారు. రెండున్నర సంవత్సరాలైనా హామీ అమలు కానందున లక్షా 90 వేల మంది సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబరు ఒకటిన ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సీపీఐ మద్దతు ప్రకటిస్తూ కార్యవర్గం మరో తీర్మానాన్ని ఆమోదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img