London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మూడోసారీ మోదీనేనా!

. పుంజుకున్న ఇండియా కూటమి
. దక్షిణాదిన బీజేపీకి అవకాశాలు
. తమిళనాడులో ‘ఇండియా’ హవా
. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా

న్యూదిల్లీ : దేశంలో 18వ సార్వత్రిక ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య పటిష్టతకు ఎంతో కీలకమైనవి. కాషాయ పార్టీ బీజేపీ గత పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేయడమే కాకుండా, హిందూత్వ వాదాన్ని ప్రజల్లోకి బలవంతంగా చొప్పించేందుకే మొగ్గు చూపింది. వరుసగా రెండుసార్లు కేంద్రంలో మిత్రపక్షాలతో కలిసి ఎన్‌డీఏగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాషాయ పాలనకు అంతం పలికేందుకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తులైన విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందుకు సాగాయి. ఈ నేపథ్యంలో ఏడు విడతల సార్వత్రిక ఎన్నికలు శనివారంతో ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మతం పేరుతో మంటలు రేపేలా ప్రసంగాలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సైతం తుంగలో తొక్కారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిని చూసీచూడనట్లుగా వ్యవహరించింది. మోదీ తన ప్రచారంలో ముస్లింలపై తన అక్కసు వెళ్లగక్కారు. లౌకిక, ప్రజాస్వామ్య హననానికి పూనుకున్నారు. అధికార పీఠమే పరమావధిగా నియంత రీతిలో ప్రసంగాలు చేస్తూ ప్రచారం చేశారు. దీనిని ఇండియా కూటమి నాయకులు గట్టిగానే ఎదుర్కొన్నారు. అయితే జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు అనేక సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేశాయి. టెలివిజన్‌ ఛానెళ్లు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడిరచాయి. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ప్రాథమికంగా దేశం ఎలా ఓటు వేసింది అనే దాని గురించి ఒక ఆలోచనను అందిస్తాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ సమాచారంపై అందరూ ఆసక్తి కనబరిచారు. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌లో అనేక సర్వేలు ఎన్‌డీఏ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తాయని అంచనా వేశాయి. దక్షిణాదిలో బీజేపీ లాభపడుతుందని పేర్కొన్నాయి. మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి వస్తుందని వెల్లడిరచాయి. 350 సీట్లకు పైగా గెలుపొందుతుందని, ప్రతిపక్ష ఇండియా కూటమి 125 నుంచి 200 మధ్య నిలుస్తుందని, ఇతర పార్టీలకు దాదాపు 36 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి.
రాజస్థాన్‌, పంజాబ్‌లో కాంగ్రెస్‌ మెరుగు
యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ ప్రకారం రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మెరుగైన పనితీరు కనబరిచినట్లు పేర్కొంది. 2019 తరహా ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం లేదని తెలిపింది. ఇండియా కూటమి 5 నుంచి 7 సీట్లు సాధిస్తుందని వెల్లడిరచింది. పంజాబ్‌లోని 13 స్థానాల్లో కాంగ్రెస్‌ 7 నుంచి 9 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. అతి చిన్న రాష్ట్రమైన గోవాలో ఎన్‌డీఏ, ఇండియా కూటమి ఒక్కో సీటు గెలుచుకుంటాయని అంచనా వేసింది. జార్ఖండ్‌లో ఈసారి జేఎంఎం`కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూటమి గతసారి కంటే 11 శాతం పెరిగి 41 శాతం ఓట్లను సాధించే అవకాశం ఉంది. కర్నాటకలో కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, కేరళలో కూడా ఇండియా కూటమి మంచి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఇక్కడ యూడీఎఫ్‌ 17 నుంచి 18 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొన్నాయి. ఎన్‌డీఏ కు కేవలం 2 నుంచి 3 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపాయి.
తమిళనాడులో ‘ఇండియా’దే హవా
ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకారం, దక్షిణాది రాష్ట్రం తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో అధికార డీఎంకే 20-22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 6-8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ కూడా 1 నుంచి 3 సీట్లు గెలుస్తుందని అంచనా.

వివిధ సర్వే సంస్థలు వెల్లడిరచిన వివరాలు
ఎన్‌డీఏ ఇండియా కూటమి ఇతరులు
దైనిక్‌ భాస్కర్‌ 285- 350 145201 33-49 ఇండియా న్యూస్‌డిడైనమిక్స్‌ 371 125 47 జన్‌ కి బాత్‌ 362392 141161 1020
రిపబ్లిక్‌ భారత్‌మాట్రిజ్‌ 353368 118133 4348
రిపబ్లిక్‌ టీవీ`పి మార్క్యూ 359 154 30
న్యూస్‌ నేషన్‌ 342-378 153-169 21-23

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img