Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సర్వం సిద్ధం

33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ కేంద్రాలు

. ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత
. 67 కంపెనీల కేంద్ర బలగాలు, 47వేల మంది పోలీసులు
. 8గంటలకు పోస్టల్‌, 8.30కి ఈవీఎంల లెక్కింపు ప్రారంభం
. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అల్లర్లకు పాల్పడితే జైలుకే
. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు
. సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్‌కు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నా మని చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయన్నారు. ఇందుకోసం 67 కంపెనీల సాయుధ భద్రతా సిబ్బంది, 45 వేల మంది పోలీసులను పూర్తి స్థాయిలో మోహరిస్తు న్నట్లు వెల్లడిరచారు. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి చిన్న ఘటనకు ఆస్కారం లేకుండా చూడటమే మా బాధ్యత అని, అందుకోసం సీనియర్‌ పోలీస్‌ అధికారులను నియమించామ న్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ లో ఏజెంట్‌ లు అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తే బయటకు పంపుతామని, తీవ్రతను బట్టి కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. కౌంటింగ్‌ సెంటర్ల పరిసరాలను రెడ్‌ జోన్‌ గా ప్రకటించామన్నారు. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం.సమస్యలను సృష్టించే 12 వేల మందిని గుర్తించి… బైండోవర్‌ చేశాం. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాం. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాం. సరైన కారణాలు ఉంటే మాత్రమే రీపోల్‌ కు ఆదేశాలు ఇస్తామ న్నారు. కొన్ని లెక్కింపు కేంద్రాలకు తాను స్వయంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించానని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయి. వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. రాష్ట్రానికి 119 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. ప్రతి కౌంటింగ్‌ హాలులో కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారు. ప్రతి సెంటర్‌లో మీడియా రూమ్‌ ఏర్పాటు చేశాం. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించు కున్నారు. 26,473 మంది హోమ్‌ ఓటింగ్‌ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశాం. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేయగా, లెక్కింపు కోసం 25వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది. ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుంది. రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు 5 గంటలు పడుతుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయి. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయి. ఫలితాలు తర్వాత పుకార్లు కూడా పెద్ద ఎత్తున పెట్రేగెేందుకు అవకాశం ఉందని గ్రహించి, దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. అలాగే ఫలితాలు వెల్లడి తర్వాత ఊరేగింపులు చేసుకునేందుకు అవకాశం లేదని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చు. కౌంటింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లు అనుమతించేది లేదు. మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకెళ్లవచ్చునని సీఈవో మీనా వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img