విశాలాంధ్ర – కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం జీడిమెట్ల పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.పలు వాహనాలకు నెంబర్ ప్లేట్, ఇతరత్ర వాటిపై వాహనాలను చెక్ చేసి నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 19 వాహనాలకు సంబందించిన వాహనదారులను కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త నెంబర్ ప్లేట్స్ ను అమర్పించారు.