ఎర్దోగన్ పిలుపు
అంకార : ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేయాలని, మారణహోమంలో భాగస్వామ్యం కావద్దని సంబంధిత దేశాలకు టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్ పిలుపునిచ్చారు. మానవతా సాయాన్ని అందించేందుకు చేయగలిగినదంతా చేస్తున్నట్లు తెలిపారు. న్యాయపరంగానూ సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఉజ్బెక్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్‌తో అంకారలో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై ఎర్దోగన్ చర్చించారు. అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గాజాలో మారణహోమంలో భాగస్వామ్యం కావద్దని, ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని ఆపాలని ఆ దేశానికి సహకరిస్తున్న దేశాలకు ఎర్దోగన్ పిలుపునిచ్చారు.