ప్రిటోరియా : క్యూబాపై అమెరికా దిగ్బంధనాన్ని విరమించుకోవాలని దక్షిణాఫ్రికా పిలుపునిచ్చింది. దక్షిణాఫ్రికాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు క్యూబాకు పెద్దఎత్తున సంఫీుభావం పలికారు. దక్షిణాఫ్రికాలోని ప్రధాన నగరాలైన కేప్‌టౌన్, దర్బన్, జోహాన్స్బర్గ్లలో ప్రజలు క్యూబాకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. దక్షిణాఫ్రికా ట్రేడ్యూనియన్స్ కాంగ్రెస్, అలయన్స్ భాగస్వాములు (ఏఎన్సీ, ఎస్‌ఏసీపీ, ఎస్ఏఎన్సీఓ) రెండూ జాతీయ కార్యాచరణ దినోత్సవంగా ప్రకటించారు. క్యూబా ప్రజలకు మానవతా సహాయాన్ని అందించాలని సంకల్పించాయి. క్యూబాకు ఆహారం, వైద్యసామగ్రి, ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అవకాశాలను అమెరికా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము క్యూబా ప్రజలకు స్నేహితులం..క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో క్యూబన్ల ప్రతిఘటన ద్వారా మేము ప్రేరణ పొంతున్నామని వీరు ప్రకటించారు. క్యూబా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కుకు మద్దతివ్వాలని, మానవతావాదానికి సహకరించాలని దక్షిణాఫ్రికా ప్రజలకు పిలుపునిచ్చారు.