Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రక్షణమంత్రిని తొలగించిన పుతిన్‌

మాస్కో : ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణమంత్రి సెర్గీ షోయిగును తొలగించి ఆ స్థానంలో ఆండ్రీ బెలౌసోవ్‌ను నియమించారు. షోయిగుకు రష్యన్‌ ఫెడరేషన్‌ భద్రతా మండలి కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. రష్యన్‌ ఫెడరేషన్‌ మిలిటరీ- ఇండస్ట్రియల్‌ కమిషన్‌లో పుతిన్‌కు ఆయన డిప్యూటీగా ఉండనున్నారు.
ఆండ్రీ బెలౌసోవ్‌ను రక్షణమంత్రిని చేయడమనేది భద్రతా కూటమి ఆర్థిక వ్యవస్థను దేశ ఆర్థిక వ్యవస్థలో ఏకీకృతం చేయాల్సిన అవసరంతో ముడిపడి ఉందని క్రెమ్లిన్‌ ప్రతినిధి చెప్పారు. బెలూసోవ్‌ గతంలో రష్యా ఉప ప్రధానిగా, దేశాధినేత సలహాదారుడిగా, ప్రభుత్వ ఆర్థిక శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబరులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా రక్షణ మంత్రిగా ఒలెక్సీ రెజ్నికోవ్‌ను తొలగించి, రుస్టెమ్‌ ఉమెరోవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఉక్రెయిన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వాలెరి జలుజ్నీ స్థానంలో ఒలెక్సాండర్‌ సిర్‌స్కీని నియమించారు.
ఉక్రెయిన్‌ దాడిలో 13మంది మృతి
రష్యా సరిహద్దు నగరం బెల్గోరోడ్‌లో ఉక్రెయిన్‌ జరిపిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌ సైన్యాలు ప్రయోగించిన మోర్టార్‌షెల్స్‌ కారణంగా 10 అంతస్తుల ఒక అపార్ట్‌మెంట్‌ను పాక్షికంగా కూలిపోయింది. 20 మంది పౌరులు గాయపడ్డారు. భవన పైకప్పు కూలిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న రష్యా అత్యవసర ప్రతిస్పందనా దళం సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించింది. బెల్గోరోడ్‌ గగనతలంలో ఉక్రెయిన్‌ ప్రయోగించిన కొన్ని క్షిపణులను, 2 డ్రోన్లను తమ రక్షణ దళాలు కూల్చివేశాయని, రష్యా ప్రకటించింది. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img