Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ఇకపై కెనడాలో వర్షానికి పన్ను

వచ్చేనెల నుంచి ‘స్ట్రోమ్‌వాటర్‌ ఛార్జ్‌’ వసూళ్లు
ప్రజల్లో ఆగ్రహం

టొరంటో: పపంచంలోనే తొలిసారిగా ‘రెయిన్‌ ట్యాక్స్‌’ (వర్షానికి పన్ను)ను కెనడా ప్రభుత్వం విధించబోతోంది. ఏప్రిల్‌ నుంచి వసూళ్లు మొదలు కానున్నాయి. ‘స్ట్రోమ్‌ వాటర్‌ ఛార్జ్‌’ పేరిట టొరంటోలో దీన్ని అమలు చేయనున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. కెనడాలో రాతి నేలలే ఉండటంతో వర్షపునీరు నేలలో ఇంకేందుకు చాలా సమయం పడుతుంది. చిన్నపాటి వర్షానికి అక్కడి రోడ్లు పొంగిపొర్లుతాయి. దీనిని ‘రన్‌ఆఫ్‌’ అంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ ‘స్మార్ట్‌ వాటర్‌ ఛార్జ్‌’ను కెనడా ప్రభుత్వం ప్రారంభించింది.
తద్వారా అదనపు నీటిని బయటకు తీస్తారు. ఇందుకయ్యే ఖర్చులను ‘రెయిన్‌ ట్యాక్స్‌’ ద్వారా భర్తీచేస్తారు. ఈ పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటుంది. భవనాలు ఎక్కువగా ఉంటే రన్‌ఆఫ్‌ కూడా అధికంగానే ఉంటుంది కాబట్టి అక్కడ పన్ను కూడా ఎక్కువ విధిస్తారు. కెనడా ఇప్పటికే అత్యధిక వ్యక్తిగత పన్ను విధించే దేశాలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు వర్షపు పన్ను అంటూ ప్రజలపై మరింత భారం మోపబోతోంది. అద్దెకు ఉండేవారికి ఈ పన్ను వర్తిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. కాగా, రెయిన్‌ ట్యాక్స్‌ను కెనడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. టొరంటో ప్రజలు ఇప్పటికే నీటి పన్ను చెల్లిస్తున్నారు. ఇందులోనే స్టామ్‌వాటర్‌ నిర్వహణ ఖర్చు ఉంటుందని స్థానికులు అంటున్నారు. మళ్లీ ప్రత్యేక పన్ను విధించడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img