Friday, May 17, 2024
Friday, May 17, 2024

గాజా పునర్నిర్మాణానికి 16 ఏళ్లు

ఐరాస వెల్లడి
జెరూసలేం: ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినట్లయితే… దాదాపు ఏడు నెలలుగా ఇజ్రాయిల్‌ చేపట్టిన వైమానిక బాంబు దాడులు, భూతల యుద్ధం వల్ల ధ్వంసమైన అన్ని గృహాలను పునర్నిర్మించడానికి 2040 వరకు సమయం పడుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడిరచింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయిల్‌.. గాజా ప్రాంతంపై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా 37 మిలియన్‌ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. ఇజ్రాయిల్‌ దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్‌ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ షెల్స్‌ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చన్నారు. గాజా స్ట్రిప్‌లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారు. ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉండవచ్చునని తెలిపారు. కాగా యుద్ధ సమయంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అమెరికా ఒత్తిడి తెచ్చిన క్రమంలో యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తర గాజాల సరిహద్దును కాగా గత ఏడాది అక్టోబరులో ఇజ్రాయిల్‌` హమాస్‌ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఏడవ సారి ఇజ్రాయిల్‌లో పర్యటించిన అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇజ్రాయిల్‌పై ఒత్తిడి చేశారు. ప్రతిపాదిత సంధి ద్వారా యుద్ధం నిలిపివేసేందుకు, గాజాలోకి అవసరమైన ఆహారం, మందులు, తాగు నీటిని పంపిణీ చేయడానికి బదులుగా హమాస్‌ తన వద్దనున్న బందీలను విడుదల చేస్తుంది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్‌లోని పలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. స్థానిక ఆరోగ్యశాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో గాజాలో మరణించిన వారి సంఖ్య 34,500 కంటే పైమాటే. ఈ యుద్ధం గాజాలని 2.3 మిలియన్ల జనాభాలో 80% మందిని వారి ఇళ్ల నుండి పారిపోయేలా చేసింది. అనేక పట్టణాలు, నగరాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఉత్తర గాజాను కరువు అంచుకు నెట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img