London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ ఓటమి

55 మంది శుత్రు సైనికులు హతం
500 మందికి గాయాలు: హెజ్బుల్లా

బీరుట్‌: దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ చిత్తైనట్లు హెజ్బుల్లా ప్రకటించింది. శత్రు సైన్యాన్ని ఓడిరచామంటూ లెబనీస్‌ షియా మూవ్‌మెంట్‌ హెజ్బుల్లా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భూతల దాడులు మొదలైనప్పటి నుంచి శుత్రు దేశానికి చెందిన 55 మంది చనిపోగా మరో 500 మందికిపైగా సైనికులు, అధికారులకు గాయాలయ్యాయని తెలిపింది. 20 మెర్కావ ట్యాంకులు, నాలుగు మిలటరీ బుల్డోజర్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. లెబనాన్‌ సరిహద్దు వెంబడి బ్యారక్‌లు, పట్టున్న ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో చనిపోయిన, గాయపడిన ఇజ్రాయిలీ సర్వీస్‌మెన్‌ లెక్క ఈ జాబితాలో లేదని వెల్లడిరచింది. ఇజ్రాయిల్‌పై దాడుల్లో కొత్త దశ మొదలవుతోందని, పోరు మరింత తీవ్రరూపం దాల్చనుందనని తెలిపింది. అక్టోబరు 1 నుంచి ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో 2,415 మంది చనిపోయినట్లు లెబనాన్‌ మంత్రిమండలి ప్రకటించింది. గాయపడిన వారి సంఖ్య 12వేలకు చేరువైనట్లు వెల్లడిరచింది.
గాజా, లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ దాడులు ఆపాలి: మాక్రాన్‌
గాజా, లెబనాన్‌లో దాడులు ఆపి… రాజకీయపరంగా చర్చలకు ముందుకు రావాలని ఇజ్రాయిల్‌ను కోరినట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ తెలిపారు. ఆ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, ఐరాస నిబంధనలకు కట్టుబడాలని, ముఖ్యంగా యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌ శాంతి దూతల విషయంలో నిబద్ధతతో వ్యవహరించాలని హితవు పలికినట్లు చెప్పారు. బ్రెస్సెల్స్‌లో జరిగిన ఈయూ సదస్సు అనంతరం మాక్రాన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘హమాస్‌ నాయకుడు యాహ్యా సిన్వర్‌ మరణం… ఈ పోరు అంతానికి ఒక అవకాశంగా ఉండాలి. సైనిక కార్యకలాపాలను తక్షణమే ఆపి… గాజాలో కాల్పులు విరమించాలి. విశ్వసనీయ రాజకీయపరమైన దౌత్యాన్ని ఇజ్రాయిల్‌, పలస్తీనా ప్రజల మధ్య జరిపించాలి’ అని అన్నారు.
గాజాలో శాంతి బాధ్యత
ఐరాసదే: చైనా
గాజాలో విపత్తుకర పరిస్థితులను కొనసాగనివ్వడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని చైనా పేర్కొంది. శాంతి నెలకొల్పే బాధ్యతలను ఐరాస భద్రతా మండలి తీసుకోవాలని అభిప్రాయపడిరది. గాజాలో మానవతా సంక్షోభంపై భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఐక్యరాజ్య సమితికి చైనా శాశ్వత ప్రతినిధి ఫు కాంగ్‌ మాట్లాడుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు కుట్టుబడేలా చర్యలు సమర్థంగా తీసుకోవడం అవసరం. ‘టూ స్టేట్‌’ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యం’ అని అన్నారు. పలస్తీనాను స్వతంత్ర దేశ హోదా కల్పిస్తే ఘర్షణ సద్దుమణుగుతుందని ఫు అన్నారు. రెండు పక్షాలు అంగీకరించినప్పుడే ‘టూ స్టేట్‌’ పరిష్కారం అమలు కాగలదని చెప్పారు.
ఇందులో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి…పోరు అంతానికి, పశ్చిమాసియాలో శాంతికి మద్దతిచ్చేందుకు చైనా సిద్ధమని ఫు కాంగ్‌ వెల్లడిరచారు. లెబనాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య తీవ్ర ఘర్షణ సాగుతుండటం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. గాజా సుస్థిరతకు సంకేతాలు అందడం లేవన్నారు. పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, తక్షణమే తగు విధంగా స్పందించి… ఈ సమస్యను పరిష్కరించడం అత్యవసరమని ఫు కాంగ్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img