Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నిద్రలోనే మృత్యుఒడిలోకి…

. విరిగిపడిన కొండచరియలు 100 మందికి పైగా మరణం

. పపువా న్యూ గినియాలో ఘటన కౌకలం గ్రామం శిధిలం

మెల్బోర్‌: సుమారు వంద మంది గాఢనిద్రలో ఉండగానే అనంత లోకాలకు చేరుకున్న ఘటన పపువా న్యూ గినియాలో జరిగింది. ఆకస్మికంగా కొండచరియలు విరిగిపడి 100మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని పోర్ట్‌ మోరెస్టీకి 600 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలో శుక్రవారం వేకువజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఆస్ట్రేలియా బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌(ఏబీసీ) పేర్కొంది. మృతుల సంఖ్య 100 కంటే ఎక్కువగా ఉన్నట్లు గ్రామస్థులు చెప్పారు. అయితే అధికారులు ధ్రువీకరించలేదు. శిధిలాల కింద నుంచి మృతదేహాలను బయటకు లాకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగి పడటంతో ప్రాణ నష్టం అధికంగా జరిగిందని, గ్రామం మొత్తం ధ్వంసమైందని స్థానికులు తెలిపారు. బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి పోర్గెరా ఉమెన్‌ ఇన్‌ బిజినెస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎలిజబెత్‌ లారుమా డిమాండ్‌ చేశారు. ప్రావిన్షియల్‌ గవర్నర్‌ పీటర్‌ ఇపాటస్‌ మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. ఈ ఘటన ప్రభావం ఆరు గ్రామాలపై పడిరదన్నారు. ఇది అనుకోని ప్రకృతి విపత్తు అని అన్నారు. అత్యవసర సహాయ బృందాలు, వైద్య సిబ్బంది, సైన్యం, పోలీసులు, ఐరాస ఏజెన్సీలు కూడా ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడి అనేక ఇళ్లు నేలమట్టమయినట్లు అధికారులు వెల్లడిరచారు. కుటుంబాలకు కుటుంబాలు సమాధి అయ్యాయన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చన్న అనుమానం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img