Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కరువు పరిష్కారానికి బహుపాక్షిక వ్యవస్థ కావాలి

ఐక్యరాజ్య సమితి అధికారి రీనా గీలానీ పిలుపు
ఐరాస: ఆకలికి మూలకారణాలను పరిష్కరించడానికి శాంతి కోసం పునరుజ్జీవింపబడిన బహుపాక్షిక వ్యవస్థ అవసరమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) అధికారి పిలుపునిచ్చారు. ‘గతేడాది కనీసం 25 కోట్ల మంది అత్యంత తీవ్ర ఆహార అభద్రత పరిస్థితులను ఎదుర్కొన్నారు. వీరిలో 3,76,000 మంది కరువుబారిన పడ్డారు. ఏడు దేశాల్లో కరువు తాండవించింది. మరో 3.5 కోట్ల మంది కరువు అంచునకు చేరారు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో అధిక ప్రభావం పిల్లలు, మహిళలపైనే పడిరది’ అని ఐరాస కరువు నివారణ, ప్రతిస్పందన సమన్వయకర్త రీనా గీలానీ అన్నారు. కరువు ప్రభావిత ఏడు దేశాల్లో నుంచి అఫ్గానిస్తాన్‌, హైతీ, సొమాలియా, దక్షిణ సూడాన్‌, యమెన్‌ దేశాలు ఐరాస భద్రతా మండలి అజెండాలో ఎప్పుడూ ఉంటాయని గుర్తుచేశారు. ‘సాయుధ ఘర్షణ ఆహార వ్యవస్థలు నాశనం చేస్తోంది. జీవనోపాధికి నష్టం కలిగించింది. ప్రజలను వలసబాట పట్టేలా చేసింది. తీవ్ర పరిస్థితులు, ఆహార సంక్షోభంతో అనేకమంది దుర్భర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇలాంటివన్నీ యుద్ధం దుష్ప్రరిణామాలే’నని ఆమె చెప్పారు. ఆహార అభద్రతా పరిస్థితి అస్థిరతకు దారితీస్తుందన్నారు. పేదరికం, అసమానత్వం, పరిపాలన సమస్యలు పెరిగిన క్రమంలో ఆహార అభద్రతా కూడా పెరిగి ప్రజలు శాంతి కంటే హింసకే మొగ్గు చూపినట్లు ఇటీవల జరిగిన ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) అధ్యయనంలో వెల్లడైంది. యుద్ధాలతో ఆకలికేకలు మిన్నంటాయి. వాతావరణ మార్పులతో పాటు ఆర్థిక వ్యవస్థలకు షాక్‌లతో మరింత విషపూరిత పరిణామాలు ఎదురవుతున్నాయని గీలానీ అన్నారు. పర్యావరణ ముప్పు అంచునున్న 10 దేశాల్లో ఏడు యుద్ధ బాధిత దేశాలని చెప్పారు. మరో నాలుగు దేశాల్లో పది లక్షల కంటే ఎక్కువ మంది కరువును అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో పేదలు మరింత పేదలవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
అన్ని రూపాల్లో ఘర్షణలు, యుద్ధాలను నివారించడం, తగ్గించడం, అంతం చేయడం కోసం సమ్మిళిత కసరత్తు అవసరమని నొక్కిచెప్పారు. ప్రభుత్వాలు, ఐరాస, ప్రాంతీయ సంఘాలు కలిసికట్టుగా బహుపాక్షిక వ్యవస్థగా ఏర్పడి ఐక్యకార్యాచరణతో ముందుకెళితే సత్ఫలితాలు సాధ్యమవుతాయని గీలానీ ఆకాంక్షించారు. ఆ దిశగా సత్వర చర్యలకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img