Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

థ్రెడ్స్‌పై దావా వేస్తాం: ట్విట్టర్

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా థ్రెడ్స్ పేరుతో కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాప్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే న్యాయపరమైన సమస్యల్లో పడింది. మెటా థ్రెడ్స్ యాప్ తమ మేథో సంపత్తి హక్కులను్ఉల్లంఘించిందని ట్విట్టర్ ఆరోపించింది. థ్రెడ్స్‌పై దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు.. ఎలాన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పిరో లేఖ రాశారు.లేఖలో మెటాపై ట్విట్టర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను మెటా నియమించుకుందని తెలిపింది. మెటా నియమించుకున్న ఆ ఉద్యోగులంతా ట్విట్టర్ యొక్క వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారన్ని కలిగి ఉన్నారని లేఖలో పేర్కొంది. ట్విట్టర్ తన మేధో సంపత్తి హక్కులను పక్కాగా అమలు చేయాలనుకుంటోంది. ట్విట్టర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత సమాచారాన్ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు తీసుకోవాలి్ని లేఖలో డిమాండ్ చేసింది. దీనిపై మెటా స్పందించింది. థ్రెడ్స్ లోని ఇంజినీరింగ్ బృందంలో ఎవరూ ట్విట్టర్ మాజీ ఉద్యోగులు లేరని పేర్కొంది. మరోవైపు ఈ పరిణామాలపై ట్విట్టర్ అధినేత మస్క్ స్పందించారు. ాపోటీ మంచిదే.. మోసం కాదు్ అని పేర్కొన్నారు.మస్క్‌ నేతృత్వంలోని ట్విట్టర్‌కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ కొత్త యాప్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ాథ్రెడ్స్్ణ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చీ రాగానే సంచలనాలు సృష్టింస్తోంది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఖాతాలు తెరవగా.. నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఇక ఏడు గంటల్లోనే కోటి మందికి పైగా యూజర్లు థ్రెడ్స్‌ యాప్‌లో ఖాతాలు తెరవడం విశేషం. ఇక ఒక్కరోజులోనే 3 కోట్లకు పైగా యూజర్లను సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img