టోక్యో: తైవాన్లో శక్తిమంతమైన భూకంపం సంభవించి సుమారు వెయ్యి మందికిపైగా గాయపడిన ఘటన మరువక ముందే జపాన్లో భూమి కంపించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూకంపం వచ్చినట్లు యూరోపియన్-మెడిట రేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడిరచింది. భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. అయితే, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడిరచింది. కాగా, తైవాన్లో బుధవారం సంభవించిన తూపాను ధాటికి10 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. 50 మందికిపైగా గల్లంతయ్యారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.