Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎకరానికి 10 వేలు సాగుసాయం అందించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : రాష్ట్రంలోని ప్రతి రైతు, కౌలు రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు సాగుసాయం అందించాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఛలో విజయవాడ రైతుల ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను రైతు సంఘం ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ప్రతి రైతు 2.45 లక్షల రూపాయల రుణ భారంతో ఉన్నారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర కల్పించాలని, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలనే ఆలోచనను ఉపసంహరించుకొని ఉచిత విద్యుత్ ను కొనసాగించాలన్నారు. అన్ని పంటలకు సర్వేనెంబర్ యూనిట్ గా పంటల భీమా వర్తింపజేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు, కౌలు రైతులకు ప్రతి నెలా 10 వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలనే డిమాండ్లతో ఆగస్టు 7న ఛలో విజయవాడలో జరుగు రైతుల ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, గోపాల్, తిక్కన్న, రామాంజనేయులు, వీరేష్, సర్ధాజ్ పటేల్, నర్సింహులు, హనుమంతు, రెక్కల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img