Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వ్యవసాయానికి ఎకరాకు 10వేలు పెట్టుబడి సాయంగా ఇవ్వాలి

విశాలాంధ్ర- కర్నూల్ సిటీ : తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏపీలోనూ వ్యవసాయానికి ఎకరాకు 10వేల రూపాయలు చొప్పున వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే జగన్నాథం పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం ఆర్థికంగా రైతులకు భారంగా మారిందన్నారు. పొరుగు రాష్ట్రం వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చి రైతులను ఆదుకుంటుందని, జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వం అని చెబుతూ ప్రతి రైతుకు రోజుకు కేవలం 37 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇస్తున్న డబ్బులు రోజుకు రూ 37 రూపాయలు,ఈ డబ్బులతో వ్యవసాయం చేయమని చెప్పడం చాలా దుర్మార్గమన్నారు. 90% సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. కూలీల ఖర్చులు పెరిగాయని, కావున ప్రతి రైతుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్నారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వీటిని అరికట్టడంలో జిల్లా వ్యవసాయ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు.జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు. రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నారు.ఈ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో ఈ నెల 3 వ తేదీన సచివాలయాల వద్ద ధర్నాలు చేపట్టామని, రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img