Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు ఉజ్వల భవిష్యత్తు

. సంఘాలు ఆదర్శవంతంగా ఉండాలి
. సెర్ఫ్ సీఈవో ఏఎండి ఇంతియాజ్‌

విశాలాంధ్ర – ఆస్పరి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందిస్తున్నందున వాటి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సీఈవో ఏఎండి ఇంతియాజ్‌ అన్నారు. శనివారం ఆస్పరికి సమీపంలోనే రామతీర్థం క్షేత్రం దగ్గర రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించిన హార్టికల్చర్ కలెక్షన్ సెంటర్ పరిశీలించి, రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఎఫ్ పి ఓ అధ్యక్షులు దేవేంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్ప్‌ సీఈవో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ పి ఓ సంఘాలు 8 లక్షలకు పైగా గ్రూపులు ఉన్నాయని అందిలో మహిళలే ఎక్కువగా ఉన్నారన్నారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలతో అధిక లాభాలు ఉన్నాయన్నారు. రైతులు, మహిళలు ఒకే రకమైన వ్యాపారం చేయకుండా ఇతర వ్యాపారాలు చేసుకోవాలని ముఖ్యంగా రిటైల్ షాపులు, పౌల్ట్రీ, సిమెంట్ ఇటుక తయారీ, హోటల్స్, రేస్తారెంట్స్, పచ్చళ్ళ, స్వీట్స్ తయారీ, ఆటో మొబైల్ లాంటి వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు అందిస్తామని అన్నారు. సబ్సిడీ రుణాలతో వ్యాపారాలు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని అన్నారు. మహిళలకు క్రమశిక్షణ ఎక్కువని ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో వారికి వారే సాటి అని సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర కీలకమన్నారు. ప్రతి మహిళ నెలసరి ఆదాయం సమకూర్చుకోవాలన్నారు. రైతు సంఘాలకు పొదుపు సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం రైతు సంఘాలకు 4 లక్షల రూపాయల చెక్కులను, స్ప్రే పంపులు, థార్పళ్ళు, సెంక్లర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి ఎండి నాంచారయ్య, సెర్ఫ్ ఎస్పీఎంయు కేశవ్ కుమార్, డిఆర్డిఎ ఐకేపి ఏపిడి శ్రీధర్ రావు, డిపిఎం అబ్దుల్ రహమాన్, నరసమ్మ ఏరియా కోఆర్డినేటర్ నవీన్, మహిళా సమైక్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఏపిఎం రాఘవేంద్ర, ఆయ్యమ్మ, అశోక్ కుమార్, రైతు సంఘాలు, పొదుపు మహిళా సంఘాలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img