విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీ నేచురల్ ఫార్మింగ్ మండల సీఆర్ పి శ్రీశైలం రైతులకు జీవామృతం, నీమాస్త్రం తయారీ విధానము మరియు ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ కె యల్లప్ప, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.