Friday, June 14, 2024
Friday, June 14, 2024

సోమన్న రచించిన పుస్తకాలు ఆవిష్కరణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు : (కర్నూలు) మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 46వ పుస్తకం”లేత గులాబీలు, 47 వ పుస్తకం” అచ్చుల పద గేయాలు” పుస్తకాలు అవధాని మేడసాని మోహన్, విశ్రాంత అటవీశాఖ అధికారులు ఏ యల్ కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ పిళ్లై చేతుల మీదుగా శనివారం తిరుపతిలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకాలను కృష్ణా జిల్లా ఆవనిగడ్డ వాసులు అరుణ, రాజగోపాల్ దంపతులకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్లు రామదాసు, సుధాకర్, పూల రామకృష్ణ, గొల్లపిన్ని సుబ్రహ్మణ్యం శర్మ, బాలసాహిత్యవేత్త కృష్ణ స్వామిరాజు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పుస్తక రచయిత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img