Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

యాదగిరప్పస్వామి పల్లకి ఉత్సవాలను జయప్రదం చేయండి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో వెలసిన శ్రీ యాదగిరప్పస్వామి పల్లకి ఉత్సవాలు ఈ నెల 10న జరుగుతాయని కురువ సంఘం తాలూకా అధ్యక్షులు దిట్టకట్టి భీరప్ప బుధవారం తెలిపారు. పల్లకి ఉత్సవాల సందర్భంగా భక్తులు స్వామివారి పల్లకి మోస్తూ కాలినడకతో మంత్రాలయం నది ఒడ్డునకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చెట్నహళ్ళికి చెందిన యాదగిరప్ప, కల్లుకుంటకు చెందిన పూజారి అల్లప్ప, మసీద్ పురంకు చెందిన వనికేరప్ప స్వామివారి పల్లకి మోస్తూ పాదయాత్ర చేస్తారని తెలిపారు. యాదగిరప్పస్వామి పల్లకి మహోత్సవానికి ఒక ప్రత్యేక ఒక ప్రత్యేకత ఉందని, ఈ ఉత్సవం 120 సంవత్సరాలు నుండి ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. చెట్నహళ్ళి గ్రామంలో వెలిసిన భీరప్పస్వామిని పల్లకిని, మసీదుపురంలోని వనికేరప్పస్వామి పల్లకి కూడా పాదయాత్ర ద్వారా మంత్రాలయం నది ఒడ్డుకు పాదయాత్ర ద్వారా తీసుకొని వస్తారని, ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి స్వాముల వారి పల్లకులను ఆయా గ్రామాలకు చేరుస్తారని తెలిపారు. కావున యాదగిరప్పస్వామి పల్లకి ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img