Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అంగన్‌వాడీల ద్వారా సంపూర్ణ పౌష్టికాహారం


వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ

విశాలాంధ్ర -ఆస్పరి : రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు జడ్పిటిసి దొరబాబు, ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త రామాంజనేయులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక 3,5 అంగన్వాడీ కేంద్రాలలో ఐసిడిఎస్ సిడిపిఓ నిర్మలాదేవి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లను గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల వద్దే భోజనాలను వండి పెట్టేవారన్నారు. ప్రస్తుతం ఈ పథకంలో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం మంచి పోషక ఆహార విలువలతో కూడిన పౌష్టికాహార కిట్లను ప్రభుత్వం ప్రతినెలా ఇంటి వద్దకే మూడు కిలోల బియ్యం, కిలో పప్పు, అర లీటరు నూనెతో పాటు రెండు కిలోల రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరాలు, 25 కోడిగుడ్లు, ఐదు లీటర్ల పాలను అందిస్తారన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలలో రక్తహీనత, లోపపోషణ ను అధిగమించుటకు సంపూర్ణ పోషణ కిట్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాతా,శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోనే అంగన్వాడీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఐసిడిఎస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, వైస్ ఎంపీపీ చంద్రకళ భర్త రాజన్న గౌడ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సునీత, పద్మ, అంగన్వాడి టీచర్లు రసూల బేగం, శ్రీలత, జయమ్మ, విశ్వకుమారి, రాధమ్మ, గర్భవతులు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img