Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ సురేష్ బాబుకు పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య, సహాయ కార్యదర్శి ఈరన్న, రాష్ట్ర నాయకులు భీమన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కావున అధికారులు స్పందించి జర్నలిస్టులు ఇళ్లు కట్టుకొని నివాసానికి అనువైన ప్రదేశంలో, ఎన్నికల కోడ్ వచ్చే లోపు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండల ప్రధాన కార్యదర్శి రామన్న, కోశాధికారి నారాయణ, పాత్రికేయులు ఏలియస్, లింగమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img