విశాలాంధ్ర ఆలూరు (కర్నూలు జిల్లా) : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతోందని పిడిఎస్ యు తాలూకా ప్రధాన కార్యదర్శి మునిస్వామి అన్నారు. గురువారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ కోమలదేవి చేతుల మీదుగా పిడిఎస్ యు 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ పిడి ఎస్ యు విద్యార్థి సంఘం విద్యార్థుల హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుందని విద్యార్థి నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు గోవిందప్ప, మన్సూర్, రామాంజనేయులు, సీఆర్పీలు వీరభద్రస్వామి, గాదిలింగప్ప, రామాంజనేయులు పిడిఎస్ యు అధ్యక్షులు దుర్గాప్రసాద్, నాయక్, మధు, మహేష్, శ్యామ్, వెంకటేష్, నాయక్, మారుతి, సిద్ధ, అరవిందు, పవన్ లు పాల్గొన్నారు.