Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉపాధి కూలీకి అస్వస్థత..

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఉపాధి హామీ కూలీ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మండలంలోని బనువనూరు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపాధి కూలీ చిట్యాల ఎల్లప్ప పాండురంగారెడ్డి పొలంలో చేపట్టిన (డక్ అవుట్ పనులు) ఉపాధి పనికి వెళ్లాడు. ఈ క్రమంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండంతో తీవ్ర అస్వస్థతకు ఒక్కసారిగా కింద పడిపోయాడు. గమనించి తోటి కూలీలు వెళ్లి చూడగా ఎండవేడికి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గమనించారు. దీంతో తోటి కూలీలు ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఎండ వేడిమి కి వడదెబ్బ తగిలిందని, సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీటీసీ ప్రభావతమ్మ తనయుడు హనుమంతు రెడ్డి, గ్రామపెద్దలు ఉశేని, రంగన్న, చంద్ర, ప్రభాకర్ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిట్యాల ఎల్లప్ప ను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కేంద్రం విధానాలు శాపంగా మారాయి. మండుటెండల్లో పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు కల్పన వంటి సౌకర్యాలకు కేంద్రం తీసివేయడంతో కార్మికులు వడదెబ్బకు గురై అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన చిట్యాల ఎల్లప్పకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img