టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బొగ్గుల కోడిగుడ్ల ఏసేపు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మాదిగలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో నెరవేరిందని టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బొగ్గుల కోడిగుడ్ల ఏసేపు అన్నారు.శుక్రవారం పెద్దకడబూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం చేసిన పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే అని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణ చేశారని, అప్పుడు అనేక మంది ఎస్సీ ఉపకులాలు మాదిగలు రిజర్వేషన్ ఫలితాలు దక్కంచుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినట్లు ఆయన గుర్తు చేశారు.ఎస్సీవర్గీకరణకు పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, సహకరించిన ప్రదాని నరేంద్ర మోడి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.