Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

శాశ్వత భూ హక్కు – భూ రక్ష పత్రాలు పంపిణీ

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని మేకడోన, బాపులదొడ్డి గ్రామాలలో శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భూ హక్కు – భూ రక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తమ ఇళ్లకు సంబంధించి శాశ్వత హక్కును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారన్నారు. ఇది ఇంటి యజమానులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని మరో మారు ఆదరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బాలనాగిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసుకొని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని వారు కోరారు. అనంతరం లబ్ధిదారులకు యాజమాన్య ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కృష్ణ గౌడ్, చిన్న మహాదేవ, కో ఆప్షన్ సభ్యులు షేర్ ఖాన్, వైసీపీ నాయకులు గజేంద్రరెడ్డి, విజయేంద్ర రెడ్డి, పూజారి ఈరన్న, చంద్రశేఖర్, మహాదేవ, మూకిరెడ్డి, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img