Friday, June 14, 2024
Friday, June 14, 2024

హోరాహోరీగా కూరగాయల మార్కెట్‌ వేలం

విశాలాంధ్ర -ఆస్పరి : మండలంలోని కైరిప్పల గ్రామంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో శుక్రవారం నిర్వహించిన కూరగాయల మార్కెట్‌ వేలం పాట హోరాహోరగా సాగింది. సర్పంచ్ కాసారం తిమ్మక్క ఆధ్వర్యంలో ఈ కూరగాయల మార్కెట్‌ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో 9 మంది పాటదారులు పాల్గొనగా బోయ గోపాల్ రూ.8.72 లక్షలకు పాట పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిమ్మక్క, మాజీ డైరెక్టర్ బీటెక్ వీరభద్రి, పంచాయతీ కార్యదర్శి రామ్మూర్తి లు మాట్లాడుతూ పంచాయతీ తీర్మానం మేరకు గ్రామంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం వేలం పాటలో వచ్చిన సగం నగదు రూ.4.36 లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. మిగిలిన నగదు రూ.4.36 లక్షలు పంచాయతీకి జమ చేస్తామన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం గ్రామపంచాయతీకి రెండు లక్షల రూపాయలు పైగా అదనంగా ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు. గ్రామ పంచాయతీ నిబంధనల మేరకే వేలం పాటను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నడుచుకోవాలన్నారు. ఈ వేలంపాటలో ఎంపీటీసీ లక్ష్మీ, లక్ష్మన్న, గ్రామంలో పెద్దలు వీరేష్ స్వామి, బండ్రోతు శ్రీనివాసులు, వీరేష్, ఓంకారయ్య, శేషిరెడ్డి, ఉరుకుందు, రంగన్న, పరిశీరాముడు, పులికొండ, నరసింహులు, రామాంజనేయులు, ఉరుకుందు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img