Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అర్హులందరికీ పథకాలు అందించాలి

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని నగర‌ మేయర్ బి.వై. రామయ్య ఆదేశించారు. బుధవారం నుంచి 19వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం మేయర్ తన క్యాంపు కార్యాలయంలో 19వ వార్డుకు సంబంధించిన మున్సిపల్, విద్యుత్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బుధవారం నుంచి 19వ వార్డులో 47వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరంగా 19వ వార్డుకు చాలా ప్రాధాన్యత ఇచ్చామని, రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పార్కులు, స్టేడియం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే 6 సచివాలయ పరిధుల్లో జగనన్న సురక్ష కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని చెప్పారు. ప్రజలు ఎవరైనా సమస్యలు చెబితే వాటిని గంటల వ్యవధిలోనే పరిష్కారించాలని, అందుకు తగ్గ సహకారం తాను అందిస్తానని వెల్లడించారు. 19వ వార్డులో జరిగే ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, డిఈఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈలు జనార్ధన్, రాచయ్య, శానిటేషన్ ఇంస్పెక్టర్ ఆర్.రాజు, విద్యుత్ శాఖ ఏఈ శ్రావణ్, నాయకులు కనికే శివరాం స్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, కే.అనిల్ కుమార్, డేవిడ్, నాగరాజు, రమణ, నాగేశ్వరావు, వేదవతి, చంద్రిక, చిన్న, శ్రీను, రాజేష్, మేస్త్రి నర్సింహులు, శ్రీనివాసరెడ్డి, ఆయా సచివాలయ అడ్మిన్లు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img