Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు


–సర్పంచ్ మూలింటి రాధమ్

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రంలోనే మేజర్ గ్రామపంచాయతీలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని సర్పంచ్ మూలింటి రాధమ్మ తెలిపారు. గురువారం స్థానిక సచివాలయ కేంద్రం–1 లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మూలింటి రాధమ్మ మండల ఈవోఆర్డి సూర్య నరసింహారెడ్డి లు మాట్లాడుతూ ఈ సంవత్సరం సరైన వర్షాలు లేని కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి మండలంలోని అన్ని గ్రామాలలో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. మరి ముఖ్యంగా మేజర్ పంచాయతీలో నీటి సమస్య పరిష్కారానికి పంచాయతీ పరిధిలో ఉన్న చేతిపంపు బోర్లలో అదనంగా పైపులు దింపి రీసైక్లింగ్ చేసి 1.5 హెచ్ బి మోటార్ తో నీటి సరఫరా చేస్తామన్నారు. నాగనాథహళ్లి వాటర్ స్కీం నుండి ఆస్పరికి రావాల్సిన త్రాగునీరు సక్రమంగా రావడం లేదని, అక్కడక్కడ పంట పొలాల్లో వాటర్ స్కీం పైపులైను లీకేజీలు గుర్తించామని, లీకేజీలు ఏర్పడిన చోట మరమ్మతులు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. మేజర్ పంచాయితీలో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోవు వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య నెలకొన్న వార్డులలో ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. కావున ఆస్పరి ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూడింటి రాఘవేంద్ర, పంచాయితీ జూనియర్ అసిస్టెంట్ కృష్ణ, పంచాయితీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ఉప సర్పంచ్ సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img