Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జగనన్న సురక్షను సద్వినియోగం చేసుకోవాలి

లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ ప్రజాప్రతినిధులు, అధికారులు

విశాలాంధ్ర -ఆస్పరి : అర్హులై ఉండి ఏ కారణంతోనైన ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల తాసిల్దార్ కుమారస్వామి, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్రలు అన్నారు. శనివారం స్థానిక సచివాలయ కేంద్రం వద్ద సర్పంచ్ మూలింటి రాధమ్మ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలకు, వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్తి స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అర్హత ఉండి మిగిలిపోయిన వారికి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలన్నారు. సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులలో అందే వినతులను అత్యంత వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రత్యేక క్యాంపులలో 11 రకాల సర్టిఫికెట్లను ఎలాంటి సర్విసు చార్జీలను వసూలు చేయకుండా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, సొసైటీ సీఈఓ అశోక్, వైకాపా నాయకులు ఎంపిటిసిలు, తిమ్మప్ప ,ప్రకాష్, ఈవోఆర్డి నరసింహారెడ్డి, వీఆర్వో హరికృష్ణ నాయక్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img