Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని : సీపీఐ

విశాలాంధ్ర -ఆలూరు : పట్టణంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు భూపేష్, మండల కార్యదర్శి రామాంజనేయులు, ఏపీ రైతు సంఘం తాలూక నాయకులు చంద్రకాంత్ రెడ్డి లు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సచివాలయ కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ మోహన్ కు సమస్యలతో కూడిన వినిత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో త్రాగునీటి సమస్యతో కోయనగర్, సిద్దేశ్వర కాలనీ, ఎస్సీ కాలనీ, గోవర్ధన్ టాకీస్ బ్యాక్ సైడ్ వార్డులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,తుంగభద్ర నుంచి రావాల్సిన నీరు సకాలంలో రాకపోవడం వల్ల పట్టణ ప్రజలు త్రాగునీటి కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారంలో మూడు రోజులకు ఒకసారి అయినా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి తాలూకా అధ్యక్షుడు శివ, శ్రీరాములు, రంగన్న, హమాలీ యూనియన్ నాయకులు రామాంజనేయులు, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img