అంగుళమంత ‘అగ్గిరవ్వ’ ‘అడవిని’ దహిస్తుంది
‘ఆలోచన’ చిన్నదైన ‘మనసును’ తొలుస్తుంది..!
‘అంకుశం’ చిన్నదైన ‘మదగజాన్ని’ నియంత్రిస్తుంది..!
‘అద్దం’ చిన్నదైనా ఆకాశాన్ని చూయిస్తుంది..!
‘అవమానం’చిన్నదైన
‘ఆత్మవిశ్వాసాన్ని’ దెబ్బతీస్తుంది..!
‘జాబిల్లి’ చిన్నదైన ‘జగతికి’ జ్యోతినిస్తుంది..!
‘పుస్తకం’ చిన్నదైన ‘మస్తకం’ పై నిలుస్తుంది..!
‘విమర్శ’ చిన్నదైన ‘‘విషములా’ పాకుతుంది..!
‘వాన చినుకు’ చిన్నదైన
‘జీవకోటికి’ ప్రాణాధారమవుతుంది..!
‘గాయం’ చిన్నదైన ‘ప్రాణం’ తోడేస్తుంది..!
‘ప్రశంస’ చిన్నదైన ‘చరిత్రను’ చెక్కుతుంది..!
‘అణుబాంబు’ చిన్నదైన ‘విధ్వంసం’ సృష్టిస్తుంది..!
‘అక్షరం చిన్నదైన ఆయుధమై పోరాడుతుంది’..!
డాక్టర్. మహమ్మద్.హసన్
సెల్ :9908059234