Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కాంతిరేఖవై పుట్టాలి…!

జీవితమంటే సేకరణే
మజిలీల స్వప్నీకరణలో
కాలానిది కొవ్వొత్తి జీవితం
దోబూచులాటల సంకల్పాలు
రూపం కోల్పోయిన సాలెగూళ్ళు
తరచి తరచి వడబోస్తే కాని
అనుభవాల్ని తాగేసిన
కన్నీటి నిధుల బరువులు తెలియవు
కంటిపాప రంగుల చిత్రాల్ని
విధిలేక చంపుకుంటే
అనంతవేదనను అమాంతంగా
విదిల్చేసిన అక్షరమే
జీవితపు ఎజెండాను ఎత్తుకుని
ధైర్యంగా అడుగేసిన మహత్తర శక్తి…
కాలం మాయాజాలంలో జీవించడమంటే
ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టడమే !
సీతాకోకచిలుకలా
రంగుల రెక్కల్ని తొడుక్కోలేక
నిశ్శబ్ద ఉద్రేకమై లేచి
కలల్ని తెరలుతెరలుగా అలికి
నీ మానాన నువ్వెళ్ళిపోతే
మబ్బులు దట్టంగా కమ్ముకుని
కటిక చీకటి ముసిరిన
ఆకాశపు సరిహద్దులపై
యుద్ధం ప్రకటించేదెవరు?
నవ లోకపు నిర్మాణానికి
శిలాఫలకం నాటేదెవరు?
కొత్తగా ఊపిరి పోసుకునే
మానవత్వపు పతాకాలను
కాలానికే సవాల్‌గా
నిలిచే మైలురాళ్లుగా మార్చి
మనిషితనాన్ని గుండెల్లో నాటేదెవరు?
చిత్రాలను చిత్రంగా మలిచే
జీవనపు కుంచెలో రంగై మరిగి
సెగతో నిండిన భావమై
కాలం కర్కశత్వాన్ని తరిమేసే
కాంతి రేఖవై నీవు పుట్టాలి !
– డా. తిరునగరి శ్రీనివాస్‌, 9441464764

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img