Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

పచ్చనినీ పనితనం మీద

పచ్చని
నీ పనితనం మీద
బాస చేసి చెబుతున్నా
స్వేదంతో చెలిమి చేసే
నీ శ్రమైక శ్వాస మీద
వాలిపోయి చెబుతున్నా
భుజాన నాగలితో
భూమిని ముద్దాడే
నీ బరువైన పాదాలపై రాలే
వాన చినుకునై చెబుతున్నా…
మోట బావికాడ నీ పొలంలో
విత్తుల్ని నాటి మట్టిముద్దై
గట్టున కూలపడ్డ దేహంపై
టప టపా రాలుతున్న
చెమట చుక్కనై చెబుతున్నా…
ఆకలేసే గుండెను ఎండగట్టి
పొలం నీళ్లకు పారగట్టి…గోర్రుకట్టి
పొలాన్ని దమ్ము చేసి
కలుపు మొక్కల్ని ఏరి
కుప్పలు పోసిన ధాన్యాన్ని
బంతికొట్టీ, తూర్పారబట్టీ
పొద్దు గుంకిన ఏల
పొలం గట్టెంట నువ్వొస్తాంటే…
పురుగు పుట్రా కుట్టి
బురదలోనే వొరిగిన నీ కోసం
కళ్ళల్లో వొత్తులేసుకుని చూస్తున్న
నీ వోళ్ళ ఊపిరినై చెబుతున్నా…
సూరీడు సురుక్కు సురుక్కున
పొడుస్తున్నా..
కాడెడ్లతో కొలువు తీరి
దుక్కి దున్నిన రారాజు భుజంపై
తడిసి ముద్దయిన
ఎర్ర రంగు కండువాన్నై చెబుతున్నా…
గంజితాగో… గటక తినో…
అన్నం మెతుకు కోసం ఆరాటపడి
వరి గొలుసుల్ని చూసి ముచ్చటపడ్డ
నీ గుండె చప్పుడునై చెబుతున్నా…
దుఃఖం నీ వొక్కడిది కాదు
నువ్వు పండిరచిన
అన్నం మెతుకులు తిన్న అందరిదీ…!
డా.కటుకోరa్వల రమేష్‌
సెల్‌: 9949083327

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img