Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వినరో వాక్యం విసుక్కోకుండా…

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
సెల్‌: 9948774243

ప్రపంచంతో మమేకమై కాలంతో కలిసి నడుస్తున్నప్పుడు, పొటమరించే అనుభవాలు ఆలోచనాపరుడైన కవిలో పొల్లుపోకుండా అనుభూతులవుతారు. అనుభూతులు అక్షరాల్ని తొడుక్కొని సాహిత్యంగా బయటకు వస్తాయ్‌. అనుభూతుల్ని సరికొత్త వ్యక్తీకరణలో చెప్పాలంటే అభివ్యక్తి కొత్తదై ఉండాలి. సాహితీవేత్త తనదైన ఆవరణలో ఉద్భవించిన సరికొత్త భాషతో పొదిగిన వాక్యాల నిర్మాణం చేయాల్సి ఉంది. 
కులాలను, మతాలను కలిపి ముడివేసిన పచ్చిపేగును కత్తిపెట్టి కోస్తున్నారెవరో! రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు సాక్షిగా పిడికెడు అక్షరాల్ని, మీ దోసిట్లో పోస్తాను. పొదుపుగా వాడుకోండి. సాహితీవేత్త తన ఆవరణలో ఉద్భవించిన సరికొత్త భాషను తనదైన ముద్రతో నూతన అభివ్యక్తితో కలాల నాల్కల మీద నిల్పి ప్రశ్నార్థకాలు సమస్యల గుట్టువిప్పే విధంగా మొలిపించాలి. కవి వాక్యాల వ్యాయామశాలలో, నిత్య కవిత్వ కసరత్తులో మునిగితేలాలి. కవిత్వానికి పరిపుష్టి కలిగించాలి. జవనాశ్వంలా వాక్యం కాలంతో కలసి పరుగులెత్తాలి. ఎవరికి వారు వారి తరం కవుల్ని మించి కవితాభివ్యక్తి ఉండాలనే సంకల్పం కలిగి ఉండాలి. కవికి వాక్యం విరుపు, చరుపు ఎరిగి ఉండాలి. అప్పుడే సమాజం కురుపు స్థితిగతులను వ్యక్తీకరించే శక్తి కవికి ఉంటుంది. 
ఆధునికత, నవ నాగరికత అంటూ మురిసిపోతున్న ప్రపంచాన్ని వో నిశ్శబ్ద మృత్యుఘోష ఆవహిస్తూ వస్తుంది. మనుషుల మధ్య సాన్నిహిత్యం వికర్షిస్తూ, మొకాలు చాటేస్తు, ఎవడి స్వార్థంలో వాడు తనమునకలవుతున్నారు. మనిషితో మనిషి నెరిపే ప్రతి సంబంధమూ వో అభద్రతా భావంగా కనిపిస్తూంది. మనుషుల మధ్య భౌతిక కలయికలే గాని మానసిక ఎడబాటు మరింతగా రోజురోజుకు బలపడుతుంది. ఈ దుస్థితి నుండి ప్రపంచాన్ని రక్షించేది సాహిత్యం మాత్రమే అనే విషయాన్ని మనిషి ఎప్పుడో మరచిపోయాడు. అక్షరం` ఆత్మను అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయి, ఆర్థిక లాభాల వెంట సాగిలపడి బతుకుతున్నాడు. 
తెలుసుకోవడం అంటే వినడం, కనడం, అధ్యయనం చేయడం, ఆలోచించడం, అవగాహనించుకోవడమనే ‘‘ప్రాసెస్‌’’ ను అజ్ఞానందకారంలోకి నెడుతుంది. మిడిమిడి జ్ఞానం మనిషిని ‘‘అంతా నాకు తెలుసు’’ ననే అజ్ఞానం వైపునకు నడిపిస్తుంది. ఈ విధమైన వ్యాధి ప్రకోపిస్తూ సాహితీవేత్తలను చుట్టేసింది. వాళ్ల శక్తిని కట్టేస్తూంది. 
ప్రాపంచిక అనుభవాలతో ప్రాపంచిక జ్ఞానాన్ని పుటం పెట్టాలి. వండగా వండగా వచ్చిన సారాన్ని చవిచూచి చప్పరించి, ఉమ్మిన వాక్యాలు ముందు తరానికి ఆదర్శమవుతాయి. గుణపాఠాల గుట్టు విప్పుతాయి. 
కవికి నకిలీ తొడుగులు పనికిరావు. కవిగా కవిత్వ కవచ కుండలాలతోనే పుట్టాలి. నీతులు వల్లించే ‘‘వటులు’’ వస్తూనే ఉంటారు. వారి సైద్ధాంతిక వాగుడు వాగుతూనే ఉంటారు. కాషాయ పవిత్రత, ఏనాడో జారిపోయింది. అది వొక ‘మార్క్‌గా’ కొంపముంచే రాజకీయాలకు ఆసరా అయింది. మాయా వటులు, ఇది కవిత్వం అంటూ కాషాయం, ముసుగులతో వేద పండిత శ్లోకాలు కొననాల్కకు అంటించుకొని వస్తుంటారు. సంస్కృత శ్లోకాలు అయినంత మాత్రాన శ్రమ జీవులు జీవనం ఏ దోపిడీకి గురికాకుండా, ఎవడి కష్టం వాడికి అందుతుందనే నమ్మకం మాత్రం ఏ శ్లోకమూ చెప్పదు. అన్యాయాలను, అక్రమాలను, దోపిడీని ఇదేమని ప్రశ్నించే నాల్కల్ని అదుపు చేసేందుకు, ఈ శ్లోకాలు వల్లె వేస్తుంటాయి. నకిలీ తొడుగుల కవి కాషాయాన్ని బలపరుస్తూ, వర్గ చైతన్యాన్ని నీరు గారుస్తుంటాడు. 
కవిగా, మనం అఫ్‌ట్రాల్‌ నీటిబొట్టు అనుకోకూడదు. నీటిబొట్టు నాదేందిలెమ్మని వొళ్లు విరుస్తూ, బద్దకం ప్రదర్శిస్తే ప్రవాహం గొంతెండిపోతుంది. మనం శ్రామిక వర్గం పక్కన కొమ్ముకాస్తు చెప్పే కవిత్వం, పెత్తనందారీతనం వెలగబెట్టాలనుకునే వర్గాల కవులకు గొంతులో వెలక్కాయపడ్డట్టుగా ఉండొచ్చు. ఎక్కిళ్లు పెడుతూ మింగుడుపడని అయిష్టత ప్రదర్శించవచ్చు. వాళ్లకు ఎక్కిళ్లు పట్టినా తలమీద తట్టైనా మన వాక్యాల ముద్దల్ని మింగించాల్సిందే!
అంతర్రూపంగా మనిషి ఏ ముసుగులో వ్యక్తమవుతున్నాడో పసిగట్టలేకపోతే సామాజిక ఎద చప్పుడు వినలేనట్లే. సామాజిక బహ్రిరూపం చూసిరాసే వాక్యం ‘పొట్టు మీద అలుకుడే’ తలల్లేని నీడలు సమీపిస్తుంటాయి. మనిషిలా ఆడుతుంటాడు. గోడ మీద పడ్డా నీడను స్పర్శించలేని దుస్థితి. నీడలు చూసి మోసపోవద్దు. పాత కలాలను తొక్కుకుంటూ కొత్త కలాలు ముందుకు నడవాలి. జాడలు మాసిపోతున్నాయ్‌. బతుకులు గుడ్డిగా అందులోనే నడుస్తున్నాయ్‌. నిత్య కవిత్వ కసరత్తుతో స్వేదంలో వాక్యం నడుస్తూండాలి. జవనాశ్వంలా వాక్యం కాలంతో పోటీపడి పరుగుతీయాలి. తరంతో పోటీపడుతూ అధిగమిస్తూ సాగే వాక్యం సామాజిక కురుపును పసిగడుతుంది. దాని వెంటబడి పరిశీలించి పరిశోధించి కురుపు కుళ్లుతనాన్ని కనిపెడుతుంది. 
జన్మ ఒక్కటే. మరణాలే బహుళం. ప్రతి మరణం గుణపాఠం అనుకునే కవి సజీవుడై నిలుస్తుంటాడు. సాహిత్యం వైఫల్యం నీదేగాని నీ కలాంది కాదు. తరలిపోతున్న నీడలు వెంట పరుగెత్తేవారూ లేకపోలేదు. అది ‘‘క్రియేటివిటికి’’ దూరంగా జరిగిపోతున్న లక్షణం. 
కవుల్లో వ్యాపిస్తున్న నిర్లిప్తతను దులపడానికి చర్నాకోలా లాంటి చరిసే ఆవేశపూరితమైన వాక్యం ఒకటి కావాలిప్పుడు. లౌక్యం తెలియని దూకుడు, లౌల్యానికి దారితీస్తుందని చెప్పే వాక్యం ఒకటి కావాలిప్పుడు.
కన్నీటి ప్రవాహాలు పాతతరం నావల్ని మోయడానికి తిరస్కరిస్తూ, ముంచి పారేస్తున్నాయ్‌. వాక్యం మానవీయతను మరిచాక దాన్ని ఏ సైద్ధాంతిక దృక్పథంలో చెప్పినా సెక్యులరిజాన్ని ‘‘మసిపూసి మారేడుకాయ’’ చేసినట్లే అవుతుంది. కవులు అధి వాస్తవికులుగా వేషం కడుతున్నారు. ఎవరికీ అర్థంకాని స్థితిలో శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నారు. అక్షరం ఆంతర్య మెరిగేందుకు ఉన్న కాలం కాస్త ఖర్చయిపోతే, ఎరిగింది ‘ఇది’ అని చెప్పే గ్యారంటీ మాత్రం శూన్యంగా మిగిలిపోతుంటే, పాఠకుని పరిస్థితి అగమ్యగోచరంగా మిగిలిపోతుంటూంది. ఇంతా చదివి ఇంట వెనకాలపడి ‘కాలు మడుచుకోను’ చేతకాక చచ్చినట్లు, వ్యర్థంగా పాఠకుడు మిగిలిపోతుంటాడు. 
కవిత్వాన్ని జీవితాన్ని జమిలిగా కలిపి తనివితీరా తాగేస్తూ అనుభవ పూర్వకంగా అనుభూతుల్ని అక్షరాలుగా కురిపిస్తేనే కవిత్వం నిలబడుతుంది. కన్నీటి ఊటతో అక్షరాల్ని శుద్ధిచేసి, పోరాట కళతో వాక్యాన్ని నిర్మిస్తే, కవికి వయసు మళ్లినా వాక్యం యవ్వనోత్సాహంతో ముందుకు దూకుతుంటూంది. 
తొక్కిడిలో ఎంత నలిగినా చావని గరిక గడ్డిపరకలా, కవితా వాక్యం చెదరని సంతకంగా మిగిలిపోవాలి. కొండను కుమ్మే పొట్టేలు ‘‘అట్టిట్యూడ్‌’’ కవికి ఉంటే, ఎంతటి నిగూఢ నిజాన్నైనా బయటపెట్టడానికి కవి భయపడడు. 
కవి రాత, కూత, నడక, నడత,ఆహార్యము, వ్యవహారికము, పలకరింపు, పులకరింపు, వైఖరి, ఇష్టాఅయిష్టాలు, నిష్ఠగా ఉంటే, ఆయన కవితా వాక్యం ‘‘వినరో వాక్యం’’ అంటూ వెంటపడుతుంటూంది. కలకాలం బతుకుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img