Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సాహితీ దార్శనికుడు దాశరథి

వేల్పుల నారాయణ
9440433475

జగత్తులో నేడుసగం దగాపడుట మానుకుంది,
పేదజనం నేడు మొగం తుడుచుకొని మేలుకుంది,
ఇక నిద్దుర రాదు మనకు ఇక చీకటి మాటలనకు.
అంటూ రచయితలకు ఒక సంఘం ఉండాలని, జన ప్రయోజనమే లక్ష్యంగా సాహితీ వ్యాప్తికి అది ఎంతో అవసరమని, ఉద్యమవ్యాప్తికి సాహిత్యం, సంఘ నిర్మాణం రెండు కళ్లలాంటివని సంఘటిత నిర్మాణం కోసం కృషిచేసిన సాహితీ దార్శనికుడు దాశరథి.
అభ్యుదయ సాహిత్యోద్యమ దార్శనికతతో ప్రజాచైతన్యం తన సాహితీ అస్త్రంగా,ప్రగతిశీల సమాజంకోసం జరిగే పోరాట కార్యా చరణలో పాలుపంచుకుంటూ ప్రజాపక్షం నిలిచిన గొప్ప కావ్యకర్త, కార్యకర్త, ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య. తెలంగాణ కోట్లాది గొంతుల పోరాట ధ్వనిని తన కవిత్వ మైక్‌గా మార్చి అగ్నిధారలుగా కురిపించాడు. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం ,అనాధుడికి ఆగర్భ శ్రీనాథుడికి, అంటూ తెలంగాణ మిముక్తి సాయుధపోరాట కార్యాచరణలో పాలుపంచుకున్నాడు. ఒకవైపు సాహితీ సృజన చేస్తూనే కావ్యకర్తగా,మరో వైపు సాహితీ వ్యాప్తి కోసం రచయితల సంఘాల్లో క్రియాశీల కార్యకర్తగా,నాయకుడిగా ద్విముఖ పాత్ర పోషించాడు. రానున్నది ఏది నిజం,అది ఒక్కటే సోషలిజం, కదలండోయ్‌ అంటూ చాటిచెపుతూనే జనం మనం అంటూ జనంతో మమేకమై తాను ప్రజా ఉద్యమంలో కదిలాడు.
దాశరథి కృష్ణమాచార్య 1925 జులై 22 న మహబూబాబాద్‌ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో వెంకటమ్మ,వెంకటాచార్య దంపతులకు జన్మించాడు.ఖమ్మం జిల్లా మధిరలో బాల్యం గడిచింది.దాశరథి 11ఏళ్ల వయసు లోనే పద్యాలు రాయడం ప్రారంభించాడు.1940 లో ఖమ్మం హైస్కూల్‌ లో మెట్రిక్యులేషన్‌ ఉర్దూలో పాసయ్యారు. భోపాల్‌ విశ్వ విద్యాలయం నుండి ప్రైవేట్‌గా పరీక్ష రాసి ఇంటర్మీడియెట్‌ పాసయ్యాడు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఇంగ్లీషులో బి.ఎ చదివాడు. తెలుగుతో పాటు సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం సాధించాడు.
నిజాం నిరంకుశ పాలనకు, దోపిడి దౌర్జన్యాలకు, అరాచకాలు అకృత్యాలకు వ్యతిరేకంగా, భూమికోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి, నియంతృత్వ పాలననుండి తెలంగాణ విముక్తికోసం సాగుతున్న కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు దాశరథి ఆకర్షితులయ్యారు.1942లో కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాత సమావేశాల్లో పాల్గొన్నాడు.దాశరథి 1944లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు దాశరథి సోదరుడు రంగాచార్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఐతే అంతకు ముందే ఆంధ్ర రాష్ట్రంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటై 1943 ఫిబ్రవరి 12,13,తేదీల్లో ప్రథమ మహా సభ జరింగింది. ఆ సభకు దాశరథి హాజరు కాకపోయినప్పటికీ వట్టికోట ఆళ్వారు స్వామి హాజరయ్యాడు. దాని ప్రభావం తెలంగాణ విముక్తి ఉద్యమంలో పనిచేస్తున్న దాశరథి సోదరులు, సుద్దాల హనుమంతు లాంటి కవులు రచయితలపై పడిరది. తెలంగాణ ప్రాంతంలో కూడా అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటుకు ప్రయత్నాలు నడిచినా నిత్య నిర్బంధాల వల్ల అవి సఫలంకాలేదు. సంఘంగా ఏర్పడక పోయినా వారు ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం భావజాలంతో మమేకమై కొనసాగారు. ఈ నేపథ్యంలోనే తరతరాల బూజు నిజాం రాజు, అంటూ దాశరథి సాహిత్య అగ్ని ధారలు కురిపించాడు. రుద్రవీణ మీటాడు. నా తెలంగాణ కోటిరత్నాలవీణ అని, నేను తెలంగాణ బానిససంకెళ్లు తెంపడానికి వెళుతున్నాను. నా వెంటరండి అంటూ తన నిబద్దతను ప్రకటిస్తూ ముందుకు సాగాడు. రైతుదే తెలంగాణము రైతుదే. ముసలినక్కకు రాచరికంబు దక్కునే అని నిజాంపీడనపై గర్జించాడు. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగి పోవోయ్‌, తెగిపోవోయ్‌ అంటూ సాహితీ బాణాలనెక్కుపెట్టాడు.
అందువల్లనే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కవిత్వం రాస్తున్నాడని,వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నాడని,1947 లో దాశరథిని నిజాం ప్రభుత్వం అరెస్టుచేసి వరంగల్‌ జైలులోపెట్టింది. ఆ తర్వాత 1948లోనిజామాబాద్‌ జైలుకు తరలించింది. మొక్కవోని ధైర్యంతో రేపటి విముక్తి తెలంగాణాను స్వప్నిస్తూ మొత్తం 16నెలల పాటు కఠినకారాగార శిక్ష అనుభవించాడు. ఆయనతోపాటు నిజామాబాద్‌ జైలులో వట్టికోట ఆళ్వారు స్వామి కూడా ఉన్నాడు. అప్పటికే ఆయన తెలంగాణ సాయుధపోరాట ఉద్యమకారుడు, ప్రముఖ అభ్యుదయ రచయిత. నిప్పుకు గాలి తోడైనట్లు దాశరథి వట్టికోట ఆళ్వారుస్వామి సహచర్యంలో జైలులోనే నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తి కవిత్వం కైగట్టాడు. ఆళ్వారు స్వామి దాశరథి పద్యాలను కంఠస్థం చేస్తూ పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద ఆ పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. అప్పుడే ఆయనతో దాశరథికి గాఢమైన మైత్రితో పాటు సాహితీ అనుబంధం పెనవేసుకుంది. అందువల్లనే తర్వాత కాలంలో దాశరథి తన అగ్నిధార కవితా సంపుటిని ఆళ్వారుస్వామికి అంకితమిచ్చాడు.
తెలంగాణ రచయితల సంఘంలో:
తెలంగాణ సాయుధ పోరాటం వల్ల నైజాం ప్రభువు నిర్వీర్యుడైన నేపథ్యంలో 1948 లో భారత ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానంపై పోలీసు చర్య జరిపింది. నిజాం లొంగి పోవడంతో తెలంగాణ సంస్థానం భారత యూనియన్‌ లో విలీనం ఐపోయింది. అప్పటికింకా తెలంగాణాలో అభ్యుదయ రచయితల సంఘం సంస్థాగత కార్యకలాపాలు మొదలు కాలేదు.ఆ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో యువకవుల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించే ఉద్దేశంతో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించారు. దాశరథి, సి.నారాయణ రెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, భోగి నారాయణ మూర్తి, పల్లా దుర్గయ్య, కాళోజి నారాయణరావు మొదలైన కవులు, రచయితలు తెలంగాణ రచయితల సంఘం స్థాపనలో ముఖ్యపాత్ర వహించారు. ఈ సంఘానికి దాశరథి అధ్యక్షుడుగా, సి. నారాయణ రెడ్డి కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సంఘం మొదటి మహాసభ 1953లో పతాపగిర్జీ కోఠీ, హైదరాబాద్‌లో జరిపారు. ఈ మహాసభల్లో శ్రీశ్రీ, ఆరుద్ర తదితర అభ్యుదయ కవులు పాల్గొన్నారు. 1955లో హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్సులో రెండవ మహాసభలు జరిగాయి. నాయకత్వ బాధ్యతల్లో దాశరథి ఈ సంఘాన్ని కొంతకాలం నడిపించాడు. సాహితీ కార్యక్రమాలను నిర్వహించాడు.1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత తెలంగాణ రచయితల సంఘాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ రచయితల సంఘంగా మార్చినప్పటికి కారణాలేమైనప్పటికి తర్వాత దాని కార్యక్రమాలు ఆగిపోయి సంఘం కనుమరుగయిపోయింది.
మరోవంక ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘంలో కూడా వివిధ కారణాలవల్ల స్థబ్ధత ఏర్పడి 1955 నుండి 1973 వరకు సంఘ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఐనా అభ్యుదయ సాహితీ సృజన మాత్రం ఆగిపోలేదు.
అభ్యదయ రచయితల సంఘంలో :
1973లో అరసం పునరుద్దరణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘంగా ఏర్పడిరది. సంఘ కార్యక్రమాలను, నిర్మాణాన్ని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో కూడా విస్తరించారు. మెదటినుండి అభ్యుదయ రచయితల సంఘంతో మమేక మవుతున్న దాశరథి సోదరులు ఆతర్వాత ఆ సంఘంలో క్రియాశీలంగా పాల్గొన్నారు.1976లో ఫిబ్రవరి 15,16 తేదీలలో హైదరాబాద్‌లో జరిగిన అభ్యుదయ రచయితలసంఘం ఏడవ మహాసభలను దాశరథి ప్రారంభించి ప్రసంగించారు. మహాసభల్లో రచయితలు ప్రగతిశీల దృక్పథంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం, శాంతి సామరస్యం, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య విలువలకోసం సాహితీ సృజన చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఆ సభల్లోనే దాశరథి కృష్ణమాచార్య అరసం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. దాశరథి రంగాచార్య రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. ఇద్దరు సంఘంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత దాశరథి 1977 ఆగస్టు 15 ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవిగా నియమితులయ్యి 1983 వరకు పనిచేశారు. ఆస్థాన కవిగా నియమితులవటం వల్ల దాశరథి ప్రత్యక్షంగా అరసం బాధ్యతలకు, కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఐనా అరసం భావజాలంతో, సాహితీ కార్యక్రమాలతో మమేకమౌతూ అభ్యుదయ సాహిత్యవ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. 5 నవంబర్‌ 1987న చనిపోయే వరకు ఆయన, నా గమ్యం ప్రపంచ శాంతి, నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం,
జనం మనం మనం జనం
జనంలేక మనం లేము` అంటూ చాటిచెపుతూ…
ఆశావాదంతో నాదారి నేను పయనిస్తాను అని సగర్వంగా ప్రకటించుకొని ఆ దారినే నడిచిన దార్శనికుడు గొప్ప ప్రజాకవి దాశరథి.తెలంగాణ సాహిత్య అస్తిత్వ ఐకాన్‌ దాశరథి.
(జులై 22 దాశరథి జయంతి సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img