Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అరసం ఆసరాగా చందు ఆత్మకథ

అనుభవాలు అందరికీ ఉంటాయి కాని అవన్నీ జీవితానుభవాలు కానక్కరలేదు. జీవితానుభవాలే ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వృత్తి రీత్యా భూభౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌, ప్రవృత్తివల్ల సాహిత్యోపజీవి అయిన ఆచార్య చందు సుబ్బారావు ఇటీవల ‘‘అరసంతో అర్ధ శతాబ్ది’’ గ్రంథం వెలువరించారు. దీన్నే కొంత సవరించి ‘‘నా సాహిత్య ప్రయాణం’’ అని పునర్ముద్రించారు. ఆయన సాహిత్య కృషి అంతా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) తో ముడివడిరదే. అలాగని ఈ గ్రంథంలో ఆయన అరసం చరిత్ర రాయలేదు. ఆ పేరుతో తన జీవిత పరిణామ క్రమాన్ని చెప్పారు.
చాలా మందికి పుట్టి పెరిగిన పరిస్థితికి, తరవాత వారి జీవితం రూపుదిద్దుకున్న తీరుకు సంబంధం ఉండదు. అప్పుడే పులి కడుపున మేక పిల్లలు పుడతాయి. జీవన నేపథ్యం ఏమిటి అన్న అంశం మీదే ఎవరి జీవితమైనా ఓ దరికి చేరుకుంటుంది. చందు సుబ్బారావు ప్రగతిశీల భావాలుగలవాడిగా మారడానికి పుట్టి పెరిగిన పరిస్థితి మేలు మాగాణంలా ఉపకరించింది. చందు నానమ్మ కోటమ్మ గాంధీ ఉద్యమ స్ఫూర్తితో గీతాలు రాసిన బొల్లిముంత అక్కయ్యకు చెల్లెలు. అక్కయ్య సాహిత్యాభిరుచి ఉన్నవాడు. అన్న దగ్గర్నుంచే ఆమెకూ సాహిత్యాభిరుచి అబ్బింది. చందు తండ్రి వెంకటకృష్ణయ్య ఉపాధ్యాయుడు. తండ్రి, నాయనమ్మ తెల్లవారురaాముననే లేచి పద్యాలు పాడే వారు. చందు మేనమామ బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. బాబాయిలూ ప్రగతిశీల సాహిత్యాభిమానులే. బొల్లిముంతకు అన్న వరసయ్యే వ్యక్తి కుమారుడు బొల్లిముంత నాగేశ్వరరావు చందుకు సహాధ్యాయి. చందు తండ్రి పిల్లలకోసం పండగలు చేయించే వారు కాని దేవుడిమీద విశ్వాసం ఉన్నట్టు కనిపించదు. తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నా దేవుడికి నమస్కరించలేదు. చందు తల్లికి మాత్రం భక్తి గట్రా ఉండేవి.
ఈ సాహిత్య, రాజకీయ వాతావరణమంతా చందును అభ్యుదయ సాహిత్యం వేపు, వామపక్ష రాజకీయాల వేపు లాక్కెళ్లింది. బెజవాడ లయొలా కళాశాలలో బి.ఎస్సీ, చదువుతున్నప్పుడు చందు మొదట్లో ఉన్నది వాళ్లమ్మకు సోదరుడి వరసయ్యె శ్రీ రామమూర్తి ఇంట్లోనే. శ్రీ రామమూర్తి సోదరులందరూ కారు డ్రైవర్లు, కండక్టర్లు. కమ్యూనిస్టు పార్టీ సభ్యులే. అక్కడ వినిపించినవన్నీ తమ్మిన పోత రాజు, సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, వేములపల్లి శ్రీకృష్ణ, మోటూరి హనుమంతరావు లాంటి అనేకానేక మంది కమ్యూనిస్టుల పేర్లే. సహజంగానే చందు ఆ బాటలోనే ప్రయాణించాడు.
చిన్నప్పటి నుంచి తెలుగు మీద అభిమానం పెంచుకున్న చందు తండ్రి పట్టుదల కారణంగా సైన్సు చదవాల్సి వచ్చింది. హాస్టల్‌ గదిలోంచి అమ్మాయిలను చూడడానికి ఉబలాటపడడం, సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు ఉండేది. సినిమా రచయితల్లోనూ చందూని ఆకట్టుకుంది వామపక్ష భావాలు, రచనా పటిమ ఉన్న వాళ్లే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టగానే తారసపడిరది చిన్ననాటి మిత్రుడు నరసింహా రావు వామపక్షవాదే. ఎమ్మెస్సీ భూభౌతిక శాస్త్రం చదవాలని సూచించింది అతనే. విశాఖపట్నంలో చందూను ఆకర్షించిందీ పురిపండా అప్పల స్వామి, శ్రీ శ్రీ, ఆరుద్ర, తల్లావరaల శివ శంకర శాస్త్రి, పూసపాటి కృష్ణం రాజు, అల్లం శేషగిరి రావు, కాళీ పట్నం రామారావువంటి వారే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంతకు ముందున్న మహామహుల పేర్లూ చందూను ఉత్సాహ పరిచినవే. ‘‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’’ నినాదాలే చందూ చెవిన పడ్డాయి. అందుకే ‘‘విశాఖ నగరం బంగాళాఖాతం చిలికిన నవ్వు…తూర్పు కోస్తా సిగలో పువ్వు’’ అనుకోగలిగాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో చందూని ఎక్కువగా ఆకర్షించింది భూభౌతిక శాస్త్ర పాఠ్య గ్రంథాలు కావు. శ్రీ శ్రీ, ఉన్నవ లక్ష్మీ నారాయణ, ఆవంత్స సోమసుందర్‌, ఆరుద్ర, బొల్లిముంత శివరామ కృష్ణ, వట్టికోట ఆళ్వార్‌ స్వామి, దాశరథి, మహీధర రాసిన గ్రంథాలే. అలాగని అసలు చదువును నిర్లక్ష్యం చేయలేదు. చందు అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ కృషి చేశాడు. కథలు, నవలలతో పాటు కవిత్వమూ రాశాడు. ‘‘పద చిత్రాలు లేకుండా పదాలను పేరుస్తున్నవ్‌…కవిత్వం మానేయటానికి ఏం తీసుకుంటావ్‌’’ అని మిత్రుడు అదృష్ట దీపక్‌ అడిగే సరికి కవిత్వం రాయడం మానేశాడు. చందు అరడజనుకు పైగా నవలికలు రాశారు. ఇవన్నీ ‘‘విద్యార్థుల, నవదంపతుల ప్రేమ కథలే. లెఫ్టిస్ట్‌ టింజ్‌ ఉండవచ్చును. అది సరిపోదు’’ అని తానే అంగీకరించాడు. సాహిత్య విమర్శా రంగంలోనూ చందు కృషి ఉంది. అనేక మంది సాహిత్యం మీద తాను చేసిన వ్యాఖ్యలు ఎలా వాళ్లని నొప్పించి, తనను ఇబ్బంది పెట్టాయో కూడా దాచుకోకుండా చెప్పాడు.
సాహిత్య విమర్శ మీద చందూకు అవగాహన ఉంది. విమర్శ అంటే తిట్టిపోయడం, ఖండిరచడం, దోషాలు చూపించడం మాత్రమే కాదని తెలిసిన వాడే. ‘‘విమర్శ పరామర్శ కాదు. నిజమే సమీక్ష కాదు…పొగడ్త కాదు. రచయిత కీర్తిని గణించడం కాదు’’ అన్న జ్ఞానం ఉన్న వాడే. ‘‘…అనవలసిన మాట గట్టిగా అనవచ్చును. దుర్బుద్ధితో గాని వ్యక్తిగత కోపాలతో గాని అనకూడదు. ఈర్ష్యా ద్వేషాలతో విశ్లేషణ పనికి రాదు. అకారణంగా ప్రశంసిస్తే ఆ రచయిత ఒక్కడే సంతోషిస్తాడు. మిగతా వాళ్లు భజన కంపెనీ అనుకుంటారు. పరులను నొప్పింపక తానొవ్వక రాస్తూ పోతే మిగిలేది బూడిద…కనక ‘‘చిత్తశుద్ధీ.. త్రాసులో తూకం’’ ఒక్కటే సూత్రంగా భావించాను.’’ అని నిర్దిష్టమైన విమర్శనా సూత్రాలను నిర్దేశించుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడే. ‘‘అనవలసిన చోట గట్టిగా అనాలి లేకుంటే విమర్శ అర్థం ఏమిటి…సారస్వత వివేచన ఏమిటి
ఆర్వీరామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img