Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బరువెక్కిన అక్షరాలు

కవిత్వం ‘బిట్వీన్‌ ద లైన్స్‌’ లో కూడా ఉంటుంది. కొందరు కవులు మాత్రమే పాఠకులకు కొంత వదిలేస్తారు. తాము దాచిన నిధికి గుర్తులు సూచిస్తారు. ‘నిజం’ పేరిట కవిత్వం రాస్తున్న జి.శ్రీరామమూర్తి అట్లాంటి కవి. పత్రికా సంపాదకులుగా పనిచేసిన సీనియర్‌ పాత్రికేయులు. ఇప్పటిదాకా వీరు ఎర్రమందారాలు, కళ్లు, నివురు, నాలుగో పాదం, కవితా సంపుటాలను ప్రచురించారు. ఇప్పుడు ‘బూడిద చెట్ల పూలు’ కవితా సంపుటితో మన ముందుకు వస్తున్నారు. కవిగా ‘నిజం’ ఎంత గట్టివారో తెలియజెప్పే కవిత ఈ సంపుటి ప్రారంభంలోనే ఉంది. అది ‘అకల’. నా దృష్టిలో ఇది ‘కలకానిది విలువైనది’. ‘నిజం’ అపార భావుకతకు తిరుగులేని ఉదాహరణ.
‘గాలిదారాలకు వేలాడుతున్న అపురూప కుసుమం/ నా నిద్ర కొలువు పీఠంపై/ ఆసీనకావాలని ఎదురు చూస్తున్నాది.’
దృశ్య శ్రవణాల మేలు కలయిక అయిన కల ఇక్కడ కుసుమమయింది. ఆ తర్వాత అదే కల ‘గారాల పిట్ట’ గా, ‘చందభామ’గా ఇంకా అనేక అవతారాలెత్తింది. కాని కవి కోరిక వేరు. ‘వీళ్లందరిని కాదని వొక ధిక్కార ‘కరదీపిక’ గా మారి ‘కలల లోకాన్ని యేలాలని వేచి చూస్తున్నాను’ అంటున్నారు. దీంతో భావుక సీమ నుండి వాస్తవిక భూమి పైకి వచ్చి తీరాలన్నది కవి ప్రతిజ్ఞ అన్నది వెల్లడయింది.
ఉత్తమ మానవుడు అంటే, సంస్కావంతుడైన మానవుడు వ్యవస్థ నుండి సమతాభావన పునాదిగా ఉన్న పరిపాలనను కోరుకుంటాడు. కవి సంక్షేమరాజ్య నిర్మాణంలో గౌరవప్రదమైన బాధ్యతను కలిగి ఉన్నవాడు. పౌరుని ఆరోగ్యమే దేశ ఆరోగ్యమన్న అవగాహనతో ముందుకు సాగుతుంటాడు. ఈ న్యాయమైన కోరికలకు అఘాతం కలిగే పక్షంలో ‘నిజం’ లాంటి కవి అసహనానికి గురవుతాడు. ‘ఏ చెరుకుగడ తెగి/ ఏ గానుగకు పానకమవుతుందో’ (ఏ) అన్న పాదాలలో హింస ఉంది. పానకమొకరికి పిప్పి ఒకరికి అన్న వర్గ దృష్టీ ఉంది. ఈ వైఖరే ఆ తర్వాత కవితలలో కూడా సాగుతూ వచ్చింది.
ప్రజా సంక్షేమం కోసం కృషి చేయవలసిన ప్రభుత్వాలు సిరిసంపదలను కొల్లగొట్టి. ‘చట్టబద్ధ బందిపోట్లకు ధారాదత్తం’ చేయాలనుకోవటం, గర్భస్థ శిశువును ముందుగానే అసహజ పద్ధతుల ద్వారా భూపతనం చేయాలని అనుకోవటంగా ‘నిజం’ భావిస్తున్నారు. ఈ అధికార గణం‘మొసళ్ల ఈతకు/ నర రక్త కొలనులు కడుతున్న/ కాపాలికుల’ (అకాల ప్రసవవేదన) ని తీవ్రంగా ఈసడిరచు కుంటున్నారు. ఈ పాదాలలోని ఆలంకారికత తీవ్రమైన మనోవేదన నుండి పుట్టింది. సంపుటిలోని ‘బిక్కు బిక్కు రైళ్లు’ కవితతో ‘నిజం’ ‘ఎంటర్‌ ద డ్రాగన్‌’ అంటూ కరోనా కాలంలోకి అడుగుపెడుతున్నారు. వియత్నాం యుద్ధ కాలంలో లక్షకు పైగా కవులు అమెరికాను వ్యతిరేకిస్తూ కవితలు రాశారట. ఇప్పుడీ కరోనా విలయ కాలంలో కొన్ని లక్షల మంది కవులు తమ సానుభూతిని, దుఃఖాన్ని, ఆక్రోశాన్ని ప్రకటిస్తూ కవితలు రాశారు. అట్లా కవిత్వ మాధ్యమం మానవతా మాధ్యమమై తన సహజ స్వభావాన్ని చాటుకున్నది. వందలమంది కవులు కరోనా వస్తువుగా కవితా సంపుటాలు ప్రచురించారు. వీరిలో ‘నిజం’ కూడా ఒకరు. ఒక అంచనా ప్రకారం 20 నుండి 25 లక్షల మంది భాగ్యహీనులు కరోనాకు బలయ్యారు. తల్లీ తండ్రీ కరోనాకు బలైపోయి చెరో బూడిదకుప్పగా కుప్పకూలిపోయిన తర్వాత వారి సంసార వృక్షం ‘బూడిద చెట్ల పూలు’ పూయక తప్పదు. కరోనా సృష్టించిన మారణహోమం గూర్చిన కథనాలను ‘నిజం’ ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల ద్వారా వ్యక్తం చేస్తూ వచ్చారు. వారి విమర్శ కూడా తీవ్ర స్థాయిలో ఉంది. ‘ప్రేత గీతమాలపిస్తున్న దేశం/ పాలకుడిలో గల్లంతైన హృదయం కోసం/ స్మశానాల్లో వెతుకుతోంది’ (శవజాగారణ) ఈ విమర్శ వ్యవస్థ మీద ఒక ప్రొటెస్ట్‌ ‘వూపిరికొసకు వేలాడుతున్న రేపటి శవాల మీది నగానట్రా/ వొలుచుకుంటున్న త్రాసుపత్రులను/ ప్రజలపరం చేయాల్సిన బాధ్యత’ ప్రభుత్వం మరిచిందన్నది కవి అభియోగం. ‘నిజం’ కవితా ప్రస్థానం ఉద్యమ మజిలీల గుండా సాగుతూ వచ్చింది. మలుపులు తిరుగుతూ వచ్చిన జీవితానుభవ స్రవంతి వారి కవిత్వం. ఈ దశలో తనదైన నడకను అపేక్షించటం న్యాయమే. భాష (డిక్షన్‌) శైలితో విడివడి ఉండలేదన్నది విజ్ఞులకు తెలియంది కాదు. ‘త్రాసుపత్రులు’ ‘చిద్విషాదనేల’ ‘ఆనంద చొక్కాలు’ ‘అన్నాకలి’ మొదలైన సమాసాలు ఏదో తమాషా కోసం సృష్టించుకున్నవి కావు. ఇవన్నీ కవి వక్రోక్తిలో భాగం. ఈ వక్రోక్తి కవి వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తున్నది. ప్రతి సమాసానికి తనదైన అర్థం ఉంది. ఉదాహరణకు త్రాసుపత్రాలు` త్రాచుపాములు నిండిన, రోగుల పట్ల విషం విరజిమ్మిన నిలయాలు. ఇంకా అధర్మ త్రాసులోని ఒక పళ్లెంలో ప్రాణాలు, మరో పళ్లెంలో రోగి నగలు ఉన్న సన్నివేశం. ఇట్లాంటి సమాన ఘటన కవి సత్యాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ‘స్టైల్‌ ఈజ్‌ ద మ్యాన్‌’ అన్నారు.
‘తనువు పచ్చని బంధాన్ని/ మనసుల వెన్నెల వంతెనను/ నరికి పరిమళ హత్యలు/ సాగిస్తున్నదెవరో తెలుసు’ (ముండనం) ఉద్దేశపూర్వకమైన అస్పష్టతలో ఎంత లోతున్నదో అనుభవించిన వాడికి తెలుస్తుంది. కరోన మూలంగా దేశంలోని అవ్యవస్థకు సామాన్య కుటుంబం ప్రాతినిధ్యం మహించటంలోని బీభత్సం పై పంక్తుల్లో ధ్వనిస్తున్నది. ‘అక్షరాల పూలబుట్ట/ మురుగు వాసన కొడుతోంది/ కొత్తవి పేర్చాలి’ (ముళ్ల బుట్ట) అన్నది కవి ప్రతిజ్ఞ, సందేశం కూడా. పత్రికాసుపత్రిలో అనుక్షణిక చరిత్ర ప్రసవిస్తున్న కొంగ్రొత్త వార్తలను ఒడిసి పట్టే సీనియర్‌ పాత్రికేయులు ‘నిజం’ సమకాలీన వస్తువుకు పూయించిన సరికొత్త పూలకు స్వాగతం పలుకుదాం.
అమ్మంగి వేణుగోపాల్‌, సెల్‌: 9441054637

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img