Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

ఎన్నికల వేళ గ్రామాల్లో అప్రమత్తంగా ఉండండి

— జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్

ఆత్మకూరు విశాలాంధ్ర : ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశించారు. జిల్లాలోని ఆత్మకూరు పోలీసు స్టేషన్ ను ఈరోజు జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ మరియు రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. రిసెప్సన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించారు. ఆత్మకూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఫ్యాక్షన్ ప్రభావిత సమస్యాత్మక గ్రామాలలోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాలలో అశాంతి, అలజడులు, సమస్యలకు కారణమయ్యే వారిపై నిరంతర నిఘా వేయాలన్నారు. గట్టిగా పని చేయాలన్నారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే ప్రతీ రికార్డును సమీక్షించారు. కేసులు త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు. దొంగతనాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను వెంటనే డిస్పోజల్ చేయాలన్నారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, గంజాయి, నాటు సారా తయారీ & అమ్మకం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ కు వచ్చిన పిటీషనర్లతో మాట్లాడారు. ఎస్పీ ఆకస్మిక తనిఖీల్లో ఎస్సై మునీర్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img