Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైకాపా పాలన… అరాచక పాలన

శంఖారావంతో ప్రజల్లోకి వెళ్ళనున్న నారా లోకేష్
తెదేపా అధికారంలోకి వస్తే ఆళ్లగడ్డ యువతకు సంవత్సరానికి 5 వేల ఉద్యోగాలు…

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 11 నుంచి శంఖారావం పేరుతో ప్రజల్లో మమైకం కానున్నారన్నారు. 120 నియోజకవర్గాలలో 40 నుంచి 50 రోజుల పాటు ప్రజల్లో ఉంటారన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు వచ్చిన సమయంలో మేము ఉన్నామని తెదేపా భరోసా ఇచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న జనసేన బిజెపితో కలిసి ఉన్నప్పటికీ వైసిపి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించిందన్నారు. జనసేన మొదటి నుండి వైసిపి పై పోరాడుతుందని కేంద్రం దృష్టికి కూడా వైసిపి తప్పులను తీసుకెళ్లిందన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. 2019లో వైసిపికి ఓటు వేసి తప్పు చేశామని నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు. యువగళం కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పాదయాత్ర చేశారన్నారు. యువత ఆయనతో తన సమస్యలు చెప్పుకున్నారన్నారు. యువగళం జరుగుతున్న సమయంలో తెదేపా అధినేత చంద్రబాబును వైసిపి ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసిందని దీంతో నారా లోకేష్ పాదయాత్ర ఆగిందన్నారు. లోకేష్ ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాలను వివరించారన్నారు. ప్రశ్నించే వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని వారందరిని కలిసి భరోసా ఇవ్వనున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు యాత్ర 2 సినిమాను హిట్ చేయాలన్న దృష్టి పెట్టారని వారు ఆ దృష్టిని ప్రజా సమస్యల పరిష్కారానికి పెడితే బాగుంటుందన్నారు. సీమ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే పరిశ్రమలు వస్తాయని ఆళ్లగడ్డలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఆళ్లగడ్డ యువతకు సంవత్సరానికి 5 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఐదు సంవత్సరాలకు 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు నాకు హామీ ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని కొంతమంది తప్పుడుగా ప్రచారం చేస్తున్నారన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తోనే వారికి సమాధానం ఇప్పిస్తామని భూమా అఖిలప్రియ అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ షేక్ హుస్సేన్ భాష పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img