జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. డ్రోన్ల ద్వారా వచ్చిన ఆయుధాలను సేకరించి, కశ్మీరులోని ఇతర ఉగ్రవాదులకు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవంనాడు పెద్ద ఎత్తున దాడి చేసేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు, వారి అనుచరులు భారీ కుట్ర పన్నినట్లు తెలిపారు. ఆగస్టు 15కు ముందే జమ్మూలో ఓ ఐఈడీని అమర్చడానికి వీరు ప్రయత్నించారన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వీరు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.