Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మద్దతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి

. రైతు నాయకులకు రాహుల్‌ భరోసా
. దిల్లీ ప్రదర్శన కొనసాగిస్తాం: రైతు సంఘాల ప్రకటన

న్యూదిల్లీ : రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఇచ్చేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రైతు సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతు నాయకుల బృందం బుధవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో పార్లమెంటు భవన సముదాయంలో సమావేశమై తమ రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. ఎంపీలు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌, సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావాతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, దీపేందర్‌ సింగ్‌ హుడా, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, గుర్జీత్‌ సింగ్‌ ఔజ్లా, ధరమ్‌వీర్‌ గాంధీ, అమర్‌సింగ్‌, జై ప్రకాష్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం ముగిసిన వెంటనే, గాంధీ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ రైతులు తనను కలవాలని కోరుకోవడానికి కారణం చట్టపరమైన హామీతో కూడిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే వారి దీర్ఘకాల డిమాండ్‌ను మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చకపోవడమేనని అన్నారు. ‘మేము ఫలవంతమైన చర్చలు చేశాం. కాంగ్రెస్‌ పార్టీ చట్టపరమైన హామీతో ఎంఎస్‌పీకి మద్దతు ఇస్తుంది. మా మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నాం. మా ఇండియా ఐక్య సంఘటన భాగస్వాములతో ఈ సమస్యను చర్చిస్తాం. వారిని ఒప్పించి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం’ అని రాహుల్‌ గాంధీ చెప్పారు. అయితే రైతులను పార్లమెంటు లోపలికి అనుమతించకపోవడంతో తొలుత గందరగోళం నెలకొంది. అంతకుముందు రాహుల్‌ మాట్లాడుతూ ‘మేము వారిని ఆహ్వానించాము. కానీ వారిని పార్లమెంటు లోపలికి అనుమతించడం లేదు. బహుశా వారు రైతులనే కావచ్చు. దీనికి కారణాన్ని మీరు ప్రధానిని అడగాలి’ అని గాంధీ అన్నారు. రైతుల్లో ఒకరైన జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. స్వామినాథన్‌ నివేదిక అమలు తప్పనిసరి అని స్పష్టం చేస్తూ, దిల్లీ వైపు పాదయాత్రను కొనసాగిస్తామని తెలిపారు. ‘పార్లమెంటు లోపల రాహుల్‌ గాంధీ రైతుల గొంతును లేవనెత్తారు’ అని ఎంపీ వారింగ్‌ సమావేశం తర్వాత ఒక ఆంగ్ల వార్తా సంస్థకు తెలిపారు. రైతులు దిల్లీలో మరో ప్రదర్శనకు ప్రణాళిక చేస్తున్నారనే వార్తలపై స్పందిస్తూ, ‘దిల్లీకి వచ్చి నిరసన తెలిపేందుకు వారికి అన్ని హక్కులు ఉన్నాయి. ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు అవసరమైతే మేము దానిని కూడా తీసుకువస్తాం’ అని అన్నారు. అంతకుముందు, రైతులు తమ రాష్ట్రాల్లోని సమస్యల గురించి గాంధీతో మాట్లాడారని, దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చడానికి, ఎంఎస్‌పీని సవరించడానికి, చట్టపరమైన మద్దతుని నిర్ధారించడానికి ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆయనను కోరారని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఈ డిమాండ్లు 2020లో ప్రారంభమైనప్పటి నుంచి వారి నిరసనలలో ప్రధానమైనవి. అయితే ఈ సమావేశాన్ని ‘రెచ్చగొట్టే ప్రయత్నం’ అని ప్రభుత్వం వెంటనే కొట్టిపారేసింది. కేంద్ర మంత్రి భగీరథ్‌ చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ మూడో దఫా రైతులకే అంకితం అన్నారు. ‘ప్రధాని మోదీ మూడో దఫా ప్రభుత్వాన్ని రైతుల కోసం అంకితం చేశారని దేశ ప్రజలు చెబుతున్నారని.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి… రాహుల్‌ గాంధీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు… అతని వల్ల ప్రభావితం కావద్దని మేము వారిని అభ్యర్థిస్తున్నాం’ అని మీడియాతో అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా రైతు సంఘాలు స్వామినాథన్‌ కమిషన్‌ సి2G50 ఫార్ములా ఆధారంగా పంటలకు కనీస మద్దతు ధర అందించాలని కోరుతున్నాయి. అయితే ఇది మద్దతు ధరలను లెక్కించేటప్పుడు మూలధనం, భూమి అద్దెపై ఆధారపడి ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఏ2Gఎఫ్‌ఎల్‌G50 శాతం పద్ధతిని వదులుకునేందుకు ప్రభుత్వం విముఖత చూపుతోంది. దిల్లీ చుట్టూ నెలల తరబడి దిగ్బంధనాలు, రైతులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణల తరువాత, మోదీ రెండవ దఫా అధికారం చేపట్టిన సమయంలో ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ, ఫార్ములా మార్పు కోసం రైతులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఎంఎస్‌పీ సమస్య కొనసాగుతూనే ఉంది. రైతులకు రుణమాఫీ చేయాలని, విద్యుత్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఢల్లీి చలో 2.0’ పేరుతో రెండోసారి నిరసనలు చెలరేగాయి. ఇదిలా ఉండగా, సోమవారం రెండు రైతు సంఘాలు… సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా తాము ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని ప్రకటించాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా ట్రాక్టర్‌ ర్యాలీని చేపట్టాలని కూడా రైతు సంఘాల నేతలు ప్రణాళిక చేస్తున్నారు. గణనీయమైన సంఖ్యలో రైతులు ఉన్న మహారాష్ట్ర, హర్యానా వంటి కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో సమస్య మరింత తీవ్రమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img