Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

గాంధీనగర్‌లో బీజేపీ గూండాగిరి

గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గూండాగిరీ పేట్రేగిపోయింది. అక్కడ నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి, హోంమంత్రి అమిత్‌షాకు పోటీ లేకుండా చేయడం కోసం అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. పోటీ నుంచి తప్పుకోవాలని అభ్యర్థులను బెదిరిస్తోంది. ప్రాణభయం చూపిస్తోంది. ఒత్తిళ్లు, ప్రభోలాలకు గురిచేస్తోంది. ఇప్పటికే సూరత్‌ స్థానంలో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇప్పుడు గాంధీనగర్‌లోనూ అమిత్‌ షా గెలుపును ఖరారు చేసేందుకు రాజకీయ ఎత్తులు`జిత్తులు ప్రదర్శిస్తోంది. బెదిరించడం ద్వారా లేక ప్రలోభపెట్టడం ద్వారా నామినేషన్లు వెనక్కి తీసుకొనేలా అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకుగాను తమ గూండాలను పురమాయించింది.

ప్రాణ భయంతో నామినేషన్‌ ఉపసంహరించుకున్న స్వతంత్ర అభ్యర్థి జితేంద్ర చౌహాన్‌ (39) సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పెట్టారు. తనకు ఎదురైన పరిస్థితిని విరవించారు. చౌహాన్‌తో పాటు 12 మంది స్వతంత్ర అభ్యర్థులు, మరో నలుగురు చిన్న పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బీజేపీ బెదిరింపులే కారణమని కొందరు తెలుపగా మరికొందరు వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. ఇంకొందరు ప్రచారానికి డబ్బు లేదని, బీజేపీలో చేరేందుకు నామినేషన్లు ఉపసంహరించుకున్నామన్నారు.
కారణంగా నామినేషన్‌ ఉపసంహరించుకున్నానని ఆయన వెల్లడిరచారు. గాంధీనగర్‌ బీజేపీకి కుంచుకోట. 1989 నుంచి ఈ లోక్‌సభ స్తానం నుంచి బీజేపీ ఎన్నికవుతూ వచ్చింది. 2019లో 5.5లక్షల ఓట్లతో అమిత్‌షా గెలిచారు. తాజా ఎన్నికల్లో గుజరాత్‌లోని 26 స్థానాలను ఐదు లక్షలకుపైగా ఓట్లతో క్లీన్‌ స్వీప్‌ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో సోమవారం ఎన్నికలు జరుగుతాయి. చౌహాన్‌తో పాటు గాంధీనగర్‌కు చెందిన ముగ్గరు అభ్యర్థులు కూడా వేధింపులకు గురైనట్లు ఆరోపణలు చేశారు. స్థానిక బీజేపీ నేతలు, ఆ పార్టీతో ముడిపడి ఉన్న వారు తమను బెదిరిస్తున్నారని చెప్పారు. గుజరాత్‌ పోలీసులు సైతం నామినేషన్ల ఉపసంహరణ కోసం ఒత్తిడికి గురి చేశారని వాపోయారు. ఇప్పటికే 16 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
జితేంద్ర చౌహాన్‌ (39) మాట్లాడుతూ ‘గాంధీనగర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకున్నా కానీ అమిత్‌షా మనుషులను నన్ను హైజార్‌ చేశారు. నేను హత్యకు గురయ్యే అవకాశం లేకపోలేదు. దేశం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. దీనిని కాపాడమని అందరికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యే దినేశ్‌ సింగ్‌ కుష్వాహా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైనట్లు చెప్పారు. ‘ఎంత కావాలో చెప్పు అని అడిగారు కానీ డబ్బుకు ఆశపడి కాదు నా ముగ్గురు కుమార్తెల భవిష్యత్‌ ఏమవుతుందని, నేను లేకుండా వారు ఎలా బతుకుతోరోనని మదన పడి వెనక్కి తగ్గాను’ అని చౌహాన్‌ వెల్లడిరచారు.
ప్రజాతంత్ర ఆధార్‌ పార్టీ తరపున గాంధీనగర్‌ బరిలో నిలిచిన సుమిత్రా మౌర్య (43) కూడా బీజేపీ తరపున తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తన ఇంటికి డజను మంది వచ్చి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరించినట్లు తెలిపారు. ‘మా బాస్‌తో మాట్లాడండి’ అంటూ తనకు, తన భర్తకు వరుస ఫోన్‌లు చేశారన్నారు. ఎందుకు పోటీ చేస్తున్నారు…తప్పుకోండన్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లండి అని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు సూచించగా భర్తతో కలిసి సోమన్‌థ్‌కు వెళితే, అక్కడకు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇబ్బంది పెట్టారు. ఫోన్‌ చేస్తే తీయరేమిటి… మా బాస్‌తో మాట్లాడండి అని ఒత్తిడి చేశారు. మా పార్టీ దీనిపై గుజరాత్‌ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. లేఖలో 12 ఫోన్‌ నంబర్లు పొందుపర్చగా ఆయా ఫోన్‌ నంబర్లు గల వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెబుతూ అమాయకత్వం నటించారని ఆమె వెల్లడిరచారు.
స్వతంత్ర అభ్యర్థి జితేంద్ర రాథోడ్‌ (40) కూడా బీజేపీ మాజీ ఎమ్మెల్యే అశోక్‌ పటేల్‌ మనుషుల నుంచి ఒత్తిడికి గురైన కారణంగా నామినేషన్‌ ఉపసంహరించుకొన్నారు. ‘అమిత్‌షా గెలుపు తథ్యం. నీవు పోటీలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోతాయి. పోటీ నుంచి తప్పుకో’ అంటూ ఒత్తిడి చేసినట్లు ఆయన చెప్పారు. రాథోడ్‌ ఓ దళితుడు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ తరపున 2019లో గాంధీనగర్‌ నుంచి పోటీ చేసి 6,500 ఓట్లు సాధించారు. గత ఎన్నికలప్పుడు కూడా ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. ఈసారి తన బంధువులను సైతం బెదిరింపులకు గురిచేసిన కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని రాథోడ్‌ చెప్పారు. బీజేపీలో చేరమంటే నిరాకరించినట్లు తెలిపారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సురేంద్ర షా, నరేశ్‌ ప్రియదదర్శిని కూడా తనలానే వేధింపులకు గురైనట్లు ఆయన వెల్లడిరచారు. అయితే ప్రియదర్శిని తన నామినేషన్‌ను ఉపంహరించుకున్న తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోగా… సురేంద్ర షా బీజేపీకి మద్దతు ప్రకటించారు. కిశోర్‌ గోయల్‌, రంజినికాంత్‌ పటేల్‌, మఖన్‌భాయి కాలియా, మెహబూబ్‌ రంజ్‌గ్రెస్‌ కూడా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
శక్తిమంతమైన పార్టీ అయివుండి బీజేపీ ఎందుకు ఇలా చేస్తోందన్న ప్రశ్నకు చౌహాన్‌ స్పందిస్తూ ‘ఓట్లు పొందడం కాదు దేశానికి హోంమంత్రిపై పోటీకి ఓ సామాన్యుడు నిలవడం వారి అహాన్ని దెబ్బతీస్తుంది. మా వంటి పేదోళ్లు రాజకీయాలకు పనికిరారు.
ఏది ఏమైనా నేను చెప్పదల్చినది ఒక్కటే దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతోంది. రాజ్యాంగం ఖూనీ అవుతోంది. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశ పౌరుల తక్షణ కర్తవ్యం’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img