Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

అసోం…లోక్‌సభ బరిలో 12 మందే మహిళలు

అసోం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2014లో 16 మంది పోటీ చేయగా, 2019 ఎన్నికల్లో 14 మంది మాత్రమే బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆ సంఖ్య 12కు పరిమితమైంది. అంటే ఇద్దరు చొప్పున అభ్యర్థులు తగ్గుతూ పోతున్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఇద్దరు మహిళలు పోటీ చేస్తున్నారు. బీజేపీ ఒక్క మహిళకే టికెట్‌ ఇచ్చింది. మరోవైపు ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమంగా పెరిగింది.
ఇప్పటికే ముగిసిన తొలి రెండు దశల్లో 79.92శాతంగా నమోదైంది. అసోంలో మొత్తం ఓటర్లు 2,45,72,144 మంది కాగా ఇందులో మహిళలు 1,23,39,242 మంది, పురుషులు 1,23,25,293 చొప్పున ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img