Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి ముర్మూ

ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి.. మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చారు. దీంతో ప్రధాని రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అంతేకాకుండా ప్రస్తుత 17 వ లోక్‌సభను కూడా రద్దు చేయాలని ప్రధాని మోదీ సిఫార్సు చేయగా.. దానికి కూడా ద్రౌపదీ ముర్మూ ఆమోదం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి.. తిరిగి ఎన్డీఏ కూటమి లోక్‌సభలో మెజార్టీ చేజిక్కించుకున్న నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభను రద్దు చేసి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను మోదీ కోరారు. అయితే ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్ 16 వ తేదీతో ముగియనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భేటీ అయిన కేంద్ర మంత్రిమండలి.. 17వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. మరోవైపు.. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నారు. ఈ నెల 8 వ తేదీన ఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. బుధవారం సాయంత్రం ఎన్డీఏ కూటమి కీలక సమావేశం జరగనుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి నేతలంతా చర్చించనున్నారు. ఈ భేటీ కోసం ఎన్డీఏ కూటమి నేతలంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా ప్రధాని నివాసంలో సమావేశంపై కొత్త ప్రభుత్వ కూర్పు, మంత్రి వర్గ ప్రమాణస్వీకారం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 7 వ తేదీన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img